Political ఐదేళ్ల పసిపిల్లలను పోలీసులతో భయపెట్టే స్థాయికి దిగజారటం అవసరమా జగన్.. చంద్ర బాబు..
Political ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడంపై అయన ఘాటైన వ్యాఖ్యలు
చేశారు. పసి పిల్లలను చూడకుండా పోలీసులతో భయపెట్టించడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల తీరుపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ ఇంట్లోకి వెళ్ళిన పోలీసులపై ధ్వజమెత్తారు.. "విజయ్ ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొర బడ్డారు... చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం గా ఉంది.. ఐదేళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారారు. " అంటూ ట్వీట్ చేశారు.
టిడిపి మాజీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడైన చింతకాయల విజయ్ ఇంటిపై పోలీసులు దొంగల్లా చొరబడ్డారని.. నిజంగా విచారణకే వస్తే డ్రైవర్ పై దాడి చేసే అంత నీచ స్థాయికి పోలీసులు దిగజారాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించారు.."బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న జగన్ రెడ్డి ప్రభుత్వం... గతంలో నర్సీపట్నంలో ఉన్న అయన ఇంటిపై దాడి జరిపించారు. వీటిపై టీడీపీ నేతలు.. ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలి. సీఐడీ లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటు.’’ అని చంద్రబాబునాయుడు అన్నారు..
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం.(1/4) pic.twitter.com/Un3u6vuaS8
— N Chandrababu Naidu (@ncbn) October 1, 2022
