For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

08:04 PM Jun 15, 2025 IST | Sowmya
Updated At - 08:04 PM Jun 15, 2025 IST
ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు
Advertisement

Latest News : ప్రముఖ సంగీత దర్శకులు చక్రి గారి 50 వ జన్మదిన వేసుకులను పురస్కరించుకొని వారి సోదరులు మహిత్ నారాయణ్ ప్రతీ సంవత్సరం చేస్తున్నట్టుగానే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అందులో బాగంగా బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ లోని రోగులకు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు చక్రి సోదరులు మహిత్ నారాయణ మరియు కుటుంబసభ్యులు.

ఈ సందర్బంగా మహిత్ నారాయణ గారు మాట్లాడుతూ... అన్నయ్య ప్రతీ జన్మదిన వేడుకలు బ్రతికున్నంత కాలం అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రామాలు, అనేక ఆశ్రమలలో సేవకార్యక్రమాలు చేయడమే కాకుండా రక్తదాన కార్యక్రమాలు చేపట్టి ప్రతీ తన జన్మదిన వేడుకలకు పెదాలతోనే  గడిపేవారు అంతే కాకుండా తన ప్రతీ విజయాన్ని కూడా మొదటి ప్రాధాన్యతగా పేదల సేవకార్యక్రమాలతోనే వేడుకగా భావించే మహోన్నత వ్యక్తిత్వం అన్నయ్యది అని ఒకింత భావొద్వేగానికి లోనయ్యారు. వారి ఆశయాలను కోరికలను కొనసాగింపులో భాగంగానే అన్నయ్య ప్రతీ, జయంతి, వర్ధంతి వేడుకలని పెదాలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాము. మా కుటుంబం మొత్తం కూడా ఇలాంటి సేవకార్యక్రమాలు చేసి చక్రి అన్నయ్య ఆత్మ శాంతిని కోరుకుంటూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Advertisement GKSC

అంతే కాకుండా చక్రి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వారి స్వగ్రామం లో కూడా సేవకార్యక్రమాలలో బాగంగా మహబూబాబాద్ పట్టణం లో రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేసారు చక్రి సోదరి వానిదేవి మరియు అభిమానులు. ఈ కార్యక్రమంలో చక్రి గారి అభిమానులు మిత్రులు కుటుంబసభ్యులు పాల్గొని సేవా కార్యకర్మాన్ని కొనసాగించారు.

Advertisement
Author Image