NRI News: లండన్ లో ఘనంగా సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు
లండన్ : టి.ఆర్.యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు.
ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి దాదాపు 200 లకు పైగా ఎన్నారై తెరాస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.
సీఎం కెసిఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్ళు ఆశీర్వదించాలని ముందుగా హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. వారంతా పూజలు, ప్రార్థనలు చేసి కెసిఆర్ గారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, రాష్ట్రాన్నే కాదు రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించి ఆశీర్వచనం అందించారు. హాజరైన అతిథులంతా కూడా ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నారు.
దాదాపు పదకొండు సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, నాడు లండన్ లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, మాకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ప్రపంచవ్యాప్త ఎన్నారై తెరాస ప్రతినిధులకు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు. హాజరై కార్యక్రమాన్ని వియజవంతం చేసిన ఎన్నారై తెరాస నాయకులకు, కుటుంబసభ్యులకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాసులు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, స్థానిక "ఎల్స్ట్రీ బోరెంహూడ్ " కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా, ఎన్నారై తెరాస నాయకులు నవీన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్, అబుజాఫర్, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్ల, సృజన్ రెడ్డి చాడా, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మధు రెడ్డి, గణేష్ పస్తం, పృథ్వీ రావుల మరియు ప్రవాస సంఘాల నాయకులు పవిత్రా రెడ్డి, శుష్మునా రెడ్డి, స్వాతి, మాధవ్, శ్రీకాంత్ ముదిరాజ్, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శైలజ, నంతిని, విద్య, అపర్ణ, పావని తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.