For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Cyberabad News : సైబరాబాద్ లో మూడవ రోజూ కొనసాగిన క్యాన్సర్ & NCD స్క్రీనింగ్

10:39 PM Nov 09, 2024 IST | Sowmya
UpdateAt: 10:39 PM Nov 09, 2024 IST
cyberabad news   సైబరాబాద్ లో మూడవ రోజూ కొనసాగిన క్యాన్సర్  amp  ncd స్క్రీనింగ్
Advertisement

పోలీసుల నుండి విశేష స్పందన : సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమం సైబరాబాద్ CTC క్యాంపస్‌లో మూడవ రోజు కొనసాగింది.

నవంబర్ 7న ప్రారంభమైన ఈ మెగా మెడికల్ హెల్త్ క్యాంప్, డిసెంబర్ 23 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పటివరకు 1,000 మందికి పైగా స్క్రీనింగ్ మరియు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు.

Advertisement

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా, బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్‌తో పాటు ఇతర NCD (Non-Communicable Diseases)లను ముందస్తుగా గుర్తించి, సమయానుకూలమైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ స్క్రీనింగ్‌లో మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ అధికారులు, సిబ్బంది, మరియు SCSC సభ్యులు సహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Tags :
Author Image