For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే" సందర్బంగా "Callforblood Foundation" మొబైల్ యాప్ ని CP శ్రీ V. C. Sajjanar, I. P. S. గారు ప్రారంభించారు.

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
 వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే  సందర్బంగా  callforblood foundation  మొబైల్ యాప్ ని cp శ్రీ v  c  sajjanar  i  p  s  గారు ప్రారంభించారు
Advertisement

Callforblood Foundation Mobile Application Launched by Cyberabad CP Sri. V. C. Sajjanar, I. P. S. Garu On World Blood Donor day..14.06.2021, Cyebarabad Police News, Telugu World Now,

వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్బంగా ఈరోజు Callforblood Foundation మొబైల్ యాప్ ని సైబరాబాద్ CP శ్రీ V. C. Sajjanar, I. P. S. గారు ప్రారంభించారు.

Advertisement GKSC

ఈ సందర్బంగా సైబరాబాద్ C. P. సజ్జనార్ గారు మాట్లాడుతూ... రక్తదాతను పొందాలంటే ఎంత కష్టం అవుతుందో వివరించారు. ప్రజలందరూ కూడా ఈ Callforblood మొబైల్ యాప్ ని ఇన్స్టాల్ చేస్కుని డోనర్ గా రిజిస్టర్ అవ్వాలని కోరారు. ఎంత టెక్నాలజీ పెరిగిన, ఎంత సైన్స్ పెరిగిన రక్తదానం చేయడానికి ఎలిజిబుల్ ఉన్న దాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు. ఈ పాండమిక్ సమయంలో తలసేమియా పేషెంట్స్ కి, కాన్సర్ పేషెంట్స్ కి, గర్భిణీలకి రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. గత సంవత్సర కాలంలో సైబరాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్లో దాదాపు 12,000 మంది రక్తదానం చేసారు. వాక్సిన్ వేసుకున్న 14 రోజులకు తర్వాత ఎలిజిబుల్ ఉన్న వారు రక్తదానం చేయవచ్చు. ఇమ్మ్యూనిటి తగ్గుతుందని అపోహలకు పోవద్దు అని సూచించారు.

ఈ సంవత్సరంలో దాదాపు 4 సార్లు స్వయంగా రక్తదానం చేశానని సజ్జనార్ గారు తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ప్రజలందరికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన Callforblood Foundation వ్యవస్థాపకుడు చింతల సంపత్ ని, మొబైల్ యాప్ ని డిజైన్ చేసిన Metis టెక్నాలజీ (Maven group) డైరెక్టర్ C. భవాని శంకర్ గార్లను, సంస్థలో ఉన్న సభ్యులందరిని పేరు పేరున సజ్జనార్ గారు అభినందించారు.

సంస్థ వ్యవస్థాపకుడు చింతల సంపత్ మాట్లాడుతూ... రక్తదాతలను ఆరెంజ్ చేసే ప్రయత్నంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. డోనర్స్ కొంతమంది సమయానికి స్పందించకపోవడము, అందుబాటులో ఉండకపోవడం, ఆరోగ్యం సహకరించక పోవడం లాంటివి జరుగుతున్నాయి. డోనర్స్ ని సమకూర్చే ప్రయత్నంలో స్నేహితులకు, బందువులకు ఫోన్ చేసి వారిని కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేయడం వళ్ళ వారి సమయం కూడా కేటాయించేవారు. ఇలా మాకు చాలా వరకు సమయం వృధా అయ్యేది. ఇప్పటికీ ఇలా సమయం వృధా కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ CALLFORBLOOD FOUNDATION...

Callforblood ఫౌండేషన్ App అనేది One Stop Solution for all the Blood requests అనే ఉద్దేశ్యంతో ఈ మొబైల్ అప్లికేషన్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ వలన పేషెంట్ కి 30 నిముషాలలో రక్తదాతను సమాకుర్చడం జరుగుతుంది. రక్తదాతల వివరాలు కూడా చాలా గొప్యంగా ఉంచడానికి అదునాతన టెక్నాలజీ కలిగిన Software ని వాడడం జరిగింది. రక్తదాతలు రక్తదానం చేసిన తర్వాత వచ్చే 3 నెలలు hide అవడం, 4 వ నెల నుండి తిరిగి ఆక్టివ్ లోకి వచ్చే విధంగా ఈ యాప్ ని డిజైన్ చేసారు. ఇంకా ఇలాంటి ఎన్నో అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ యాప్ ని డిజైన్ చెయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 800 మందికి పైగా రక్తదానం, సెకండ్ వేవ్ లో 50కి పైగా ప్లాస్మా దానం చేపించడం జరిగింది. ఈ క్రమంలో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మిత్రులకు, రక్తదాతలకు, శ్రేయోభిలాషులకు, గురువులకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు  తెలుపుకుంటున్నామని చింతల సంపత్ తెలిపారు.

ఇట్లు
మీ శ్రేయోభిలాషి
చింతల సంపత్
Callforblood Foundation, Founder
+91 9491254120
www.callforbloodfoundation.com

Callforblood Foundation Mobile Application launched by Cyberabad CP Sri. V. C. Sajjanar, I. P. S. Garu On World Blood donor day..14.06.2021,v9 news telugu,teluguworldnow.com,

Advertisement
Author Image