For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

movie రామ్ చరణ్ మూవీకి విలన్ హై లైట్ కానున్నాడా..!

12:18 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:18 PM May 13, 2024 IST
movie రామ్ చరణ్ మూవీకి విలన్ హై లైట్ కానున్నాడా
Advertisement

అంతర్జాతీయంగా విడుదలైన RRR సినిమాతో పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలందుకున్న చరణ్‌…. ఈ సినిమా తర్వాత అదే స్థాయి సినిమాలను అనౌన్స్‌ చేశారు. RRR బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత… భారీ సినిమాలకు చిరునామాగా నిలిచే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఓ భారీ మూవీని ప్రకటించి… ఆశ్చర్యపరిచారు.

సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం… 90వ దశకం నేపథ్యంలో జరిగిన పలు రాజకీయాంశాలకు నేటి వాతావరణానికి తగ్గట్లుగా సరిపోల్చుతూ… ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీని శంకర్ RC15 అనే వర్కింగ్ టైటిల్‌పై నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని… స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… తన సంస్థలో 50వ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అంశాన్ని హీరో రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఎస్‌జే సూర్య ఫొటోని షేర్ చేస్తూ 'వెర్సటైల్ యాక్టర్ మా స్టెల్లర్ కాస్ట్‌లో చేరారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్' అంటూ ఎస్‌జే సూర్యను ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగతం చెబుతూనే పోస్ట్‌ చేశారు. రామ్ చరణఫ్ షేర్ చేసిన ఎస్.జె. సూర్య ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement GKSC

అయితే.. ’ఇండియన్-2’ రీ ఓపెన్ కారణంగా RC 15 కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఆ బ్రేక్‌ను దాటుకుని… ఇప్పుడు తాజాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోృ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్.జె. సూర్య RC 15 సెట్ లోకి అడుగుపెడుతున్నారట. ఇప్పటికే రాజమండ్రి, అమృత్ సర్, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తయింది. ఎస్.జె. సూర్య ఎంట్రీతో ఈ మూవీ షూటింగ్‌ స్పీడందుకోనుంది.

Advertisement
Author Image