For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్' గ్రంథాలయానికి తన రచనలను అందించిన బిఎస్ రాములు

08:04 PM Jul 02, 2023 IST | Sowmya
Updated At - 08:04 PM Jul 02, 2023 IST
 తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్  గ్రంథాలయానికి తన రచనలను అందించిన బిఎస్ రాములు
Advertisement

ప్రముఖ రచయిత, సామజికవేత్త తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు తన రచనలను తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్ గ్రంథాలయానికి అందించారు.

బిఎస్ రాములు రచించిన పాలు, ఒక సృష్టికర్త ఆత్మ చింతన, ప్రేమంటే ఏమిటి? స్నేహం ప్రేమ పెళ్లి, అడవిలో వెన్నెల, లీడర్ షిప్, గెలుచుకున్న జీవితం, కాలం తెచ్చిన మార్ఫు, బతుకు పయనం, చూపు, బిసిల ఆశాజ్యోతి బిపి మండల్, బంగారు తెలంగాణ వర్తమానం భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో మలుపులు, సమగ్ర సామజిక కథ తాత్విక భూమిక లాంటి పుస్తకాలతో పాటు,

Advertisement GKSC

డాక్టర్ కర్రె సదాశివ్ కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్ డి కోసం చేసిన బి.ఎస్ రాములు సాహిత్యం సమగ్ర పరిశీలన సిద్ధాంత గ్రంధాన్ని,అలాగే డాక్టర్ అన్నమ్ దాస్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందిన బిఎస్ రాములు కథలు తెలంగాణ జనజీవన చిత్రణ సిద్ధాంత గ్రంథం, నందిగామ నిర్మల కుమారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్ పట్టా పొందినటువంటి బిఎస్ రాములు కథలు సామజిక పరిణామాలు అనే పరిశోధన గ్రంథాన్ని, విహారి రాసినటువంటి నవ్య కథాశిల్పి బిఎస్ రాములు-కథా విశ్లేషణ లాంటి పలు పుస్తకాలను తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులి అమృత్ కు బిఎస్ రాములు అందజేశారు. బిఎస్ రాములు రచనలు తెలంగాణ సినిమా రచయితలకు ఉపయుక్తంగా ఉంటాయని పులి అమృత్ ఈ సందర్బంగా బిఎస్ రాములుకు కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement
Author Image