For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Teluguplex : 'తెలుగుప్లెక్స్ డాట్ కామ్'కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

12:15 PM Dec 10, 2024 IST | Sowmya
UpdateAt: 12:15 PM Dec 10, 2024 IST
teluguplex    తెలుగుప్లెక్స్ డాట్ కామ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
Advertisement

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ స్టార్ట్ చేస్తున్న "తెలుగుప్లెక్స్" అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు భారాస అగ్రనేత కేటీఆర్. తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి (USA)తో కలిసి ప్రముఖ సినీ విశ్లేషకుడు - పాత్రికేయుడు - పి.ఆర్.ఓ "ధీరజ అప్పాజీ" సారధ్యంలో రూపుదిద్దుకున్న "తెలుగుప్లెక్స్" వెబ్సైట్ ను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించి "ఆల్ ది బెస్ట్" చెప్పారు.

సినిమా వార్తలతోపాటు రాజకీయ, జీవనశైలి సంబంధిత విశ్లేషణలకు తెలుగుప్లెక్స్ లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన అప్పాజీ… తన బిజీ షెడ్యూల్ మధ్య.. తెలుగుప్లెక్స్ ఆవిష్కారానికి సమయమిచ్చిన విజనరీ లీడర్ కేటీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకనిర్మాత "బందూక్ లక్ష్మణ్" పాలుపంచుకున్నారు!!

Advertisement

ఫిల్మ్ జర్నలిస్టుగా- అనలిస్టుగా తెలుగు చిత్రసీమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం.. పి.ఆర్.ఓగా రెండు వందల పైచిలుకు చిత్రాలకు పనిచేసిన అనుభవం కలిగిన ధీరజ అప్పాజీ…. "సినీస్టార్, చిత్రాంజలి, ట్రేడ్ గైడ్" సినీవార పత్రికలకు ఎడిటర్ గా, "సూర్య" దినపత్రిక సినిమా సెక్షన్ ఇన్-ఛార్జ్ గా పనిచేసి… డిజిటల్ సినీ డైలీస్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన "స్వాతిముత్యం" డిజిటల్ డైలీ పేపర్ ను గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నారు!!

Advertisement
Tags :
Author Image