For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఖమ్మం లో బీ ఆర్ ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయం : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

02:23 PM Jan 19, 2023 IST | Sowmya
Updated At - 02:23 PM Jan 19, 2023 IST
ఖమ్మం లో బీ ఆర్ ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయం   మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Advertisement

బీ ఆర్ ఎస్ మొదటి సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది, సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు, మాకు మార్గదర్శనం చేసిన మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక అభినందనలు, ఖమ్మం ప్రజాప్రతినిధులకు, సభకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు, అందరి సమన్వయం తో సభ జయప్రదమైంది, ఖమ్మం చరిత్ర లో ఇంతటి సభ ఎపుడూ జరగలేదు, సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల సీఎం లు మాజీ సీఎం ,నేతలకు ధన్యవాదాలు.

మాకు సంక్రాంతి 18 న జరిగింది అనిపించింది, మీడియా కు ధన్యవాదాలు, ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్, మిగతా నేతలు దేశానికి దిశా నిర్దేశం చేశారు, ఈ సభ ను కేవలం పది రోజుల వ్యవధి లో విజయవంతం చేశాము, ఈ సభ ఖమ్మం లో జరగడం మా అదృష్టం, ఖమ్మం జిల్లాకు నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ఖమ్మం అభివృద్ధికి గుమ్మం లా మారింది.

Advertisement GKSC

కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలు, సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకం లో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది.. లేదంటే మేమే ఓ టీం ను పంపిస్తాం, బండి సంజయ్ కు 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవాలి, సభ తో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయి.

Advertisement
Author Image