For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Lok Sabha Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి BRS దన్ను..

11:30 PM Mar 23, 2024 IST | Sowmya
UpdateAt: 11:30 PM Mar 23, 2024 IST
lok sabha elections 2024   పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి brs దన్ను
Advertisement

బీసీ లకు పెద్దపీట.. పార్టీ తో చర్చించి.. ఆచి తూచి నిర్ణయం తీసుకున్న అధినేత కేసీఆర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అధ్యక్షుడు కేసీఆర్..
అభ్యర్థుల ఎంపికలో సర్వత్రా హర్షం.. 

బిఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి “ గా నిలిచిందని రాజకీయ విశ్లేషకుల కితాబు 

Advertisement

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీ లకు పెద్ద పీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్ను గా నిలిచిన బిఆర్ఎస్ అధినేత ను పలువురు ప్రశంసిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత నివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ఎస్టీ ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒకసారి బిఆర్ఎస్ కేటాయించిన స్థానాలను పరిశీలిస్తే…

హైదరాబాద్ మినహా ఇప్పటికే 16 స్థానాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులతో వరసగా చర్చలు జరిపి సమష్టి నిర్ణయంతో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 5 రిజర్వుడ్ స్థానాలున్నాయి. వాటిల్లో రెండు ఎస్టీ రిజర్వ్ స్థానాలుండగా వాటిలో ఒకటి లంబాడ మహిళకి ( మహబూబాబాద్ ) కేటాయించగా మరో స్థానాన్ని ( ఆదిలాబాద్ ) ఆదివాసి వర్గానికి బిఆర్ఎస్ అధినేత కేటాయించారు. ఇవి పోగా మిగిలిన మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో ..రెండు పార్లమెంటు స్థానాలను మాదిగలకు (నాగర్ కర్నూల్, వరంగల్ ) కేటాయించగా..పెద్దపెల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది.

ఇవి పోగా.. ప్రకటించిన మిగతా 11 స్థానాల్లో 5 స్థానాలను బీసీలకు కేటాయించి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. వాటి వివరాలు పరిశీలించినట్లయితే… రెండు స్థానాలను మున్నూరుకాపులకు(జహీరాబాద్, నిజామాబాద్) , ఒక స్థానాన్ని ముదిరాజ్ (చేవెళ్ల )లకు, ఒకటి గొల్ల కుర్మలకు(భువనగిరి), ఒక స్థానాన్ని ( సికింద్రాబాద్ ) గౌడ్ సామాజిక వర్గాలకు కేటాయించి..పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలు పరచడంలో బిఆర్ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బిఆర్ ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమౌతుంది.

కాగా… హైదరాబాద్ నుంచి పోటీ లో బీసీ అభ్యర్థినే అధినేత ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీ లకే ఖరారైతే..రిజర్వుడ్ పోగా మిగిలిన 12 సీట్లల్లో 6 సీట్లు అంటే యాభై శాతం బీసీలకే కేటాయించినట్లు అవుతుంది. కాగా… ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. వాటిలో నాలుగు రెడ్లకు ఒకటి కమ్మ ఒకటి వెలమ సామాజిక వర్గానికి బిఆర్ఎస్ పార్టీ కేటాయించింది.

తెలంగాణ లో జరిగే (మొత్తం 17) పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 పార్లమెంటు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  1. ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు
  2. మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
  3. కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్
  4. పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
  5. మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
  6. చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
  7. వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
  8. నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్
  9. జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
  10. ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు
  11. మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి
  12. మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
  13. నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్
  14. సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్
  15. నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి
  16. భువనగిరి - క్యామ మల్లేశ్
Advertisement
Tags :
Author Image