Ramzan : దేవుని దయతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి : కేసీఆర్
లౌకిక వాద స్ఫూర్తిని గంగా జమున వారసత్వాన్ని కొనసాగిద్దాం - కేసీఆర్
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు.
గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ జన జీవనం దర్పణంగా నిలుస్తుందని అన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పలు కార్యక్రమాల ద్వారా, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.
లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణకు మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని, అదే వారసత్వాన్ని కొనసాగించాలని తెలిపారు. నెల రోజుల పాటు సాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఆకాంక్షలు దేవుని దీవెనలతో సాకారం కావాలని కేసీఆర్ గారు ప్రార్థించారు.