For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

04:37 PM Oct 09, 2021 IST | Sowmya
Updated At - 04:37 PM Oct 09, 2021 IST
తల్లి  చెల్లి  భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Advertisement

*ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత*

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉందన్నారు.

Advertisement GKSC

ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ ఎన్ జే క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆసుపత్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలియజేశారు.

Breast Cancer Awareness Program, MNJ Cancer Hospital, Kalvakuntla Kavitha, Health News, Telugu World Now,

Advertisement
Author Image