Thandel Movie : నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ నుంచి బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా రిలీజ్
FILM NEWS : యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు.
హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. వండర్ ఫుల్ మోలోడీస్ ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్ప ప్రెజంట్ చేశాయి.
సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. నాగ చైతన్య రగ్గడ్ లుక్ లో అదరగొట్టారు, సాయి పల్లవి ఎలిగెంట్ గా తన క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ ఇద్దరి జోడి అద్భుతంగా వుంది. అద్భుతమైన విజువల్స్, వోకల్స్, కంపోజిషన్ తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది.
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తారాగణం : నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక బృందం :
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డిఓపీ: శ్యామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో