For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ప్రిన్స్, నరేష్ అగస్త్య 'కలి' మూవీ టీజర్ రిలీజ్

05:09 PM Jul 07, 2024 IST | Sowmya
Updated At - 05:09 PM Jul 07, 2024 IST
డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ప్రిన్స్  నరేష్ అగస్త్య  కలి  మూవీ టీజర్ రిలీజ్
Advertisement

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు "కలి" మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు. "కలి" మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

"కలి" మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే - స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

The cast includes Prince, Naresh Agastya, Neha Krishnan, Gauthamraju, Gundu Sudarshan, Kedar Shankar, Mani Chandana, Madhumani, among others.

Technical Team :

Music: Jeevan Babu

Editor: Vijay Cutts

Cinematography: Nishant Katari, Ramana Jagarlamudi

Songs: Saraswathiputra Ramajogaiah Shastri

Creative Producers: Radhakrishna Tathineni, Dharani Kumar TR

Executive Producer: Phaniendra

PRO: GSK Media (Suresh - Sreenivas)

Submitted by: K. Raghavendra Reddy

Producer: Leela Gautam Varma

Written and Directed by: Siva Seshu

Advertisement
Author Image