For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కూకట్‌పల్లిలో బీజేపీ జెండా ఎగరేస్తాం : పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేవల్లి. శరణ్ చౌదరి

10:24 PM Jun 27, 2023 IST | Sowmya
Updated At - 10:24 PM Jun 27, 2023 IST
కూకట్‌పల్లిలో బీజేపీ జెండా ఎగరేస్తాం   పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేవల్లి  శరణ్ చౌదరి
Advertisement

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ మరియు నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల సాధక బాధకాలను తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ‘‘ఇంటింటికీ బిజెపి’’ కార్యక్రమంతో నియోజకవర్గంలోని కుటుంబాలను కలిసి,శ్రీ ప్రధాని మోదీ గారి సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు.

Advertisement GKSC

ఈ సందర్భంగా వడ్డేవల్లి.శరణ్ చౌదరి మాట్లాడుతూ... ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 9 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలను ప్రజలకు వివరించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన చూస్తే మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నది. మోదీ గారి పట్ల అభిమానం, బిజెపి పట్ల ఆదరణ చూస్తుంటే, మా లక్ష్యాన్ని మించి ప్రజల గుండెల్లో చేరుకోగలుగుతామన్న విశ్వాసం కలుగుతున్నది అని అన్నారు.

ఇదే విధంగా రాబోవు ఎన్నికల వరకు నియోజకవర్గంలోని నాయకులు,కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల మధ్య ఉంటే కూకట్‌పల్లిలో కాషాయ జెండా ఎగురేస్తాం అని ధీమా వ్యక్తం చేసారు.

Advertisement
Author Image