Telangana News: ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా "భూదాన్ పోచంపల్లి": United Nations World Tourism Organisation (UNWTO)
10:20 PM Nov 16, 2021 IST | Sowmya
Updated At - 10:20 PM Nov 16, 2021 IST
Advertisement
తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి ఖ్యాతి గడించింది.
ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ.. భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
Advertisement