For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Honey For Hair : తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందనేది అపోహ .. హనీ జుట్టుకి ఎంతో మంచిది అంటున్నారు .. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి ..

01:32 PM Jul 06, 2023 IST | Sowmya
Updated At - 01:32 PM Jul 06, 2023 IST
honey for hair   తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందనేది అపోహ    హనీ జుట్టుకి ఎంతో మంచిది అంటున్నారు    ఎలానో ఇప్పుడే తెలుసుకోండి
Advertisement

benefits of honey for hair : జుట్టుకి తేనె రాస్తే తెల్లగా అయిపోతుందని చాలామంది నమ్ముతారు. అలా చేయవద్దని ఇతరులకు సూచిస్తారు. నిజానికి అది ఎవరూ ఎప్పుడూ అనుభవ పూర్వకంగా అయితే చెప్పిన సందర్భాలు ఉండకపోవచ్చు. అయితే ఈ అపోహలు పక్కన పెట్టమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందనే భయాన్ని వదిలేయమంటున్నారు. తేనె కారణంగా ఇంకా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

రెగ్యులర్‌గా ఇళ్లలో తేనె వాడుతుంటారు. అయితే జుట్టు విషయానికి వచ్చేసరికి తేనె విషయంలో చాలామంది జాగ్రత్తలు చెబుతారు. తేనె జుట్టుకి రాస్తే తెల్లబడిపోతుందని చెబుతారు. నిజానికి తేనె జుట్టుని తేలికపరుస్తుందట. జుట్టుని సున్నితంగా ఉంచటమే కాకుండా కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుందట. జుట్టు పెరగడానికి సహాయపడటంతో పాటు హెయిర్‌కి మెరుపు ఇస్తుందట. నేచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుందట.

Advertisement GKSC

తేనెలో నియాసిస్, రిబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టుని కాంతివంతం చేస్తుందట. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా పెరిగేలా తోడ్పడుతుందట. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ఏజెంట్. దాని కారణంగా అతిగా తేనెను జుట్టుకు రాయడం వల్ల కాస్త రంగు తగ్గుతుందని చెబుతున్నారు. అంటే నల్లటి రంగు జుట్టు ఉన్నవారు తేనె ఎక్కువగా రాయడం వల్ల బ్రౌన్ కలర్‌లోకి మారుతుందట. అంతేకానీ.. పూర్తిగా తెలుపురంగులోకి మారడం కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

Advertisement
Author Image