For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Eggs For Health : నైట్ త్వరగా నిద్రపట్టడానికి ఎగ్స్ తినడం బెస్ట్ సొల్యూషన్.. అవి ఏంటో తెలుసుకోండి ...

01:17 PM Jun 04, 2023 IST | Sowmya
Updated At - 01:17 PM Jun 04, 2023 IST
eggs for health    నైట్ త్వరగా  నిద్రపట్టడానికి  ఎగ్స్ తినడం బెస్ట్ సొల్యూషన్   అవి ఏంటో తెలుసుకోండి
Advertisement

Eggs for health : గుడ్లలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ముఖ్యంగా సాయంత్రం వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్లలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రాత్రుళ్ళు తినడం వల్ల మరిన్నీ లాభాలు ఉన్నాయి.

Advertisement GKSC

మంచి నిద్ర..
సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల ముఖ్యమైన లాభాల్లో నిద్ర ఒకటి. ట్రిఫ్టోఫాన్ పుష్కలంగా ఉన్న గుడ్లని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ ట్రిఫ్టోఫాన్ తీసుకోవడం వల్ల మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతుంది. హార్మోన్ల సమస్యల్ని దూరం చేస్తుంది. వీటిలోని మెలటోనిన్ నరాల కణాల పనితీరుని మెరుగ్గా చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపడుతుంది.

ఎప్పుడు తినాలి..
తినమన్నాం కదా అని మరీ నిద్రకి ముందే తీసుకోవద్దు. పడుకోవడానికి ముందు రెండు, మూడు గంటల ముందు తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. సహజంగా నిద్రపోవాలనుకున్నవారు ఈ గుడ్లని తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు. గుడ్లలోని మెలటోనిన్ అందుకు బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చేవారు గుడ్డులోని తెల్ల సొన తీసుకోవడం మంచిది.

బరువు తగ్గడం..
చాలా మంది బరువు తగ్గాలని చూస్తుంటారు. అలాంటి వారు గుడ్లు తినడం వల్ల అందులోని ప్రోటీన్ చాలా వరకూ ఆకలి కాకుండా చేస్తుంది. రాత్రుళ్ళు ఎక్కువ తినకుండా చేస్తుంది. అదే విధంగా, ముందుగా చెప్పుకున్నట్లు గుడ్లు తింటే మంచి నిద్ర పడుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. గుడ్లలో లిపో ప్రోటీన్ స్థాయిలను పెంచడంలో సాయపడతాయి. దీని వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

Advertisement
Author Image