Crime : సమయస్ఫూర్తితో ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని కాపాడిన ఆటో డ్రైవర్
Crime ఏ విషయంలో అయినా సమయస్ఫూర్తి ఎంతో అవసరం.. ఇలా సమయస్ఫూర్తి చూపించిన ఆటో డ్రైవర్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు..
ఒక వ్యక్తి సమస్య పూర్తిగా నిండు ప్రాణాన్ని కాపాడింది.. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సంఘటన లో ఆటో డ్రైవర్ని అందరూ మెచ్చుకుంటున్నారు వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా డోర్నకల్ లింగాల అడ్డామీదుగా వెళ్తున్న ఓ ఆటోను ఆపి ఓ యువకుడు ఎక్కాడు. అయితే తర్వాత వచ్చే గోవిందరాల స్టేజ్ వరకు తను వెళ్లాలని ఆటో డ్రైవర్ కు చెప్పిన యువకుడు ఈ క్రమంలో తన సోదరికి ఫోన్ చేసి తన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపాడు అంతేకాకుండా తాను ఇప్పటికే పురుగుల మందు తాగి ఉన్నాను అని కూడా చెప్పాడు..
అది విన్న ఆటో డ్రైవర్ వెంటనే సమస్పూర్ ప్రదర్శించాడు సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆయన ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.. అలాగే అతనికి సకాలంలో చికిత్స అందేటట్టు చేసి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వారికి ఫోన్ చేసి ఈ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చాము అంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆటో డ్రైవర్ శివ..
ఇంతలో వైద్యులు ఆ వ్యక్తికి చికిత్స అందించారు ఈలోగా ఆసుపత్రికి చేరుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అయ్యారు అక్కడికి వచ్చిన అతని తల్లి ఆటో డ్రైవర్ కు ధన్యవాదాలు తెలిపింది.. బాధిత వ్యక్తి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన పేరు భూక్య లాలు గా బాధితుడి బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటనేది తమకు తెలియదన్నారు..