For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"అరణ్య" సినిమాలో రానాను చూస్తే అడవి మనిషి ఇలాగే వుంటాడేమో అనిపిస్తుంది.

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
 అరణ్య  సినిమాలో రానాను చూస్తే అడవి మనిషి ఇలాగే వుంటాడేమో అనిపిస్తుంది
Advertisement

ఇండియాలో జరిగిన యదార్ధ ఘటన ఆదారంగా ఈ "అరణ్య "చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రభు సాల్మాన్

Advertisement GKSC

జన జీవనానికి చెట్ల ఆవశ్యకత ఏమిటో అందరికీ తెలుసు. అడవులు కొట్టేస్తే మానవ ఉనికికే ప్రమాదమన్న కాన్సెప్ట్‌ను ఎంచుకుని... దర్శకుడు ప్రభు సాల్మాన్‌ అరణ్య తీశాడు. అడవిలో టౌన్‌ షిప్‌ను డ్రీమ్‌గా భావించే మంత్రిని హీరో ఎలా నిలువరించాడన్న పాయింట్‌తో అరణ్య తెరకెక్కింది. సినిమా మొదలు ఇదే చివరి వరకు ఇదే కథగా నడుస్తుంది. మరి ఈ ఒక్క పాయింట్‌కు 2 గంటల 40 నిమిషాలు చూపించకుండా వుంటే.. సెకండాఫ్‌లో బోరింగ్‌ సీన్స్‌ తగ్గేవి. హీరోకు సినిమా కష్టాలు ఆపాదించడంతో సినిమా సాగదీసినట్టు అనిపించింది. అడవి కాన్సెప్ట్‌ సినిమాలు ముఖ్యంగా ఏనుగు మెయిన్‌ రోల్‌గా తమిళంలో తీసిన కుమ్కి .. విజయం సాధించింది. ఆ అనుభవం దర్శకుడికి అరణ్య తీయడానికి ఉపయోగపడింది. అరణ్య బాక్సాఫీస్‌ను మెప్పించకపోయినా..చిన్న పిల్లలకు నచ్చుతుంది. ఎందుకంటే.. అడవిలో ముఖ్యంగా ఏనుగుల మధ్యలో రెండున్నర గంటలు గడిపామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమా మరీ తీసేసే డిజాస్టర్ అయితే కాదు. అడవిలో లక్ష చెట్టు నాటి... అడవినే నమ్ముకున్న పాత్రలో రానా సెట్ అయ్యాడనే కంటే.. జీవించాడనమే కరెక్ట్. అడవి మనిషి ఇలాగే వుంటాడేమో అనిపిస్తుంది. అడవులో పక్షులు చేసే కిలకిలారావాలు రసూల్‌ పూకుట్టి ఆడియోగ్రఫీ చెవికి మంచి సౌండ్‌ను అందించింది. అరణ్య కమర్షియల్‌గా ఆడకపోయినా... రానా కెరీర్‌లో చెప్పుకోవడానికి ఒక మంచి సినిమాగా నిలుస్తుంది. సినిమాలో కాన్సెప్ట్‌ వున్నా లేకపోయినా.. కథనంతో ఆకట్టుకుంటే చాలు. ఒక్కోసారి కథలో విషయం వున్నా... ప్రపంచానికి ఉపయోగపడే పాయింట్‌ వున్నాబాక్సాఫీస్‌ వద్ద నిలబడలేవు. ఇలాంటి కోవలోకే అరణ్య సినిమా వస్తుంది. ప్రేక్షకుడికి చివరకు ఒక మంచి సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

Advertisement
Author Image