Skill Development Scam : ప్రత్యేక కధనం : చంద్రబాబు ఒక వేళ బెయిలుపై బయటకు వస్తే ఎలా మాట్లాడతారు ?
ప్రత్యేక కధనం : ఎలా బిహేవ్ చేస్తారు ?? ఆయన యాటిట్యూడ్ లో ఛేంజింగ్ వచ్చే అవకాశముందా లేదా ???
ఇప్పుడిదో ఊహాజనితమైన వ్యవహారం. నిజంగా చంద్రబాబు తాను అరెస్టు అయ్యే వరకు కూడా చాలా చాలా అహంభావంతో ఉండేవారు. తనను వైయస్సారే ఏం చేయలేక పోయారు. ఆయన కొడుకనగా ఎంత? ఇప్పటికే తనపై 26 సార్లు కమిషన్లు వేశారు. ఏం పీకలేక పోయారు.పాతిక వరకూ స్టేలు తెచ్చుకున్నా. ఆ మాటకొస్తే.. హైదరాబాద్ నేనే కట్టా. కంప్యూటర్ నేనే కనిబెట్టా. సెల్ ఫోన్ ఆవిష్కరణ నాదే. జగన్ని జైల్లో పెట్టేస్తా. లక్షకోట్ల ఆస్తి నాది. విజన్ ట్వంటీ ట్వంటీ సృష్టికర్తను నేను. సంపద సృష్టి నా బ్లడ్ గ్రూప్. ఇలా రకరకాలుగా మాట్లాడి ఓవర్ ఎగ్జైట్ అయిన బాబు.. అరెస్టు కాబోయే ముందు కూడా ఎంతో డాంబికంగా మాట్లాడిన బాబు.. ఫైనల్లీ తన అర్ధశతాబ్దపు రాజకీయ జీవితానుభవంలో తొట్ట తొలిసారిగా జైలుకెళ్లారు. జైల్లో ఉండి కూడా.. ఇప్పటికీ ఆయన చేసిన తప్పు ఒప్పుకోవడం లేదు. ఆయన మద్దతు దారులు, పార్టీ సింపథైజర్లు కూడా అవినీతి రాజకీయాల్లో సహజమప్పా.. అంటూ జనరలైజ్ చేసే యత్నం చేస్తుంటే.. బాబు ఇప్పటికీ ఒకే మాట మీదున్నారు.
అదేమిటంటే... క్వాష్ పిటీషన్ వేసి.. తనపై కేసు కొట్టేయమని న్యాయమూర్తులను అడుగుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడాన్ని బట్టీ చూస్తే.. మనకో విషయం క్లారిటీ వస్తుంది. మాజీ ప్రధాని బహుభాషా వేత్త పీవి నరసింహరావును జైల్లో పెట్టబోయే ముందు.. ఘటన ఆయన గుర్తు చేశారు. పీవీని ఇక జైల్లో పెడతారనగా.. ఒక లాయర్ వెళ్లి.. ఈ వయసులో ఆయన్ను జైల్లో పెట్టడం వల్ల ఏమొస్తుంది? పాస్ పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నారు కదా? అలాంటపుడు.. ఆయన అనగా ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఆయనకు బెయిల్ ఇప్పించమని ముకుళిత హస్తాలతో ఆ లాయర్ ఎంతో సాదాసీదాగా అడగటంతో ఆ న్యాయమూర్తి కనికరించి.. బెయిలు మంజూరు చేశారనీ. ఆ బెయిలు ద్వారా ఆయన బయట పడ్డారనీ. జైలుకెళ్లారనే ముద్ర నుంచి తప్పించుకున్నారనీ అంటారు.
కానీ, ఇక్కడ బాబు ఆయన లాయర్స్ అండ్ కో.. ఆ అవకాశాలను వాడుకోకుండా.. ఇప్పటికీ అదే వాదన. ఆ వాదన ఏంటంటే.. 17 ఏ, అంటే గవర్నర్ కి చెప్పి అరెస్టు చేయలేదనటం. అసలీ కేసే లేదని.. క్వాష్ పిటీషన్ ఏపీ హైకోర్టులో వేయటం.. అది కొట్టేసినా సుప్రీం కోర్టుకు వెళ్లటం.. వంటివి చూస్తే బాబు బెయిలుపై జైలు నుంచి బయటకొచ్చాక కూడా అదే ఫార్మాట్లో వర్క్ చేసేలా కనిపిస్తోంది.
నిజానికి జగన్ కూడా ఇంతే. తనను రాజకీయ కక్ష కోణంలోనే.. జైల్లో పెట్టారని. తాను గానీ కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే.. ఈ పాటికి తనపై కనీసం చిన్న కేసు కూడా ఉండేది కాదన్న వాదన ఆయన వినిపించడం అది జనం కూడా నమ్మడం.. ఆయన ఒక క్రమానుగతిన అధికార పీఠం చేజిక్కించుకోవడం జరిగింది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యేలా కనిపిస్తోంది. సుప్రీం కోర్టు క్వాష్ పిటీషన్ కొట్టేశాక బెయిలు కోసం అప్లై చేసి.. ఎలాగోలా బయటకొచ్చినా.. ఆయన తన తప్పు ఒప్పుకునే ప్రసక్తే ఉండక పోవచ్చు. ఆయన వ్యవహార శైలిలో ఇసుమంతైనా మార్పు రాక పోవచ్చు.
బేసిగ్గా జైలుకు పంపేదే.. వారిలో ఒక రకమైన మానసిక మైన మార్పు వస్తుందని ఆశించి. కానీ, బావు విషయంలో అలాంటివేం జరుగుతున్నట్టే కనిపించదు. ఇప్పటికీ బాబుకు ఇంటి భోజనం, ఏసీ సదుపాయం, అన్నిరకాల ఔషధాలు, మందులు.. ఇలా వివిధ రకాలుగా వసతి సదుపాయాలను పొందుతున్నారు. పైపెచ్చు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా.. పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి ద్వారా ఆయన ప్రవర్తనలో కొంత పరిణితి రావల్సి ఉంది. కానీ అలా జరుగుతుందా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
అందరిలోనూ ఒకటే ఆలోచన అదేంటంటే.. ఆయన పని ఒత్తిడి కారణమో లేక మరేదైనా పర్వర్షనో తెలీదు.. ఈ ప్రపంచంలోని ప్రతిదీ తన ప్రభావంతోనే జరిగిందని చెప్పుకోవడం యనకో పరిపాటిగా మారింది. దీనికి వల్లభనేని వంశీ, సజ్జల వంటి వారు స్క్వీజో ఫోనియా అంటూ రకరకాల జబ్బులు ఆయనకు ఉన్నట్టు చెప్పిన పరిస్థితులు. ఇవన్నీ ఓవర్ థింకింగ్, విపరీతమైన పని ఒత్తిడి వంటి కారణాల వల్ల.. వస్తుంటాయని అంటారు మానసిక వైద్యులు.
ఇప్పుడాయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన శరీరం కాస్త కుదుట పడే అవకాశముంది. సరిగ్గా అదే సమయంలో కొంత మానసిక పరిపక్వత సాధించే పరిస్థితులూ ఉన్నాయి. దీంతో ఆయనలో మార్పు వచ్చే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. కానీ అలా జరుగుతుందా? లేదా అన్నదే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇంకా కూడా ఆయన ఓవర్ యాక్షన్, హైపెర్ యాక్టివిటీస్ లోనే ఉంటారా? లేదా ఏదైనా మార్పు వస్తుందా రాదా.. తేలాల్సి ఉంది.
బేసిగ్గా ఆయన తనకు తాను అతీతుడిగా భావిస్తుంటారు. అంతే కాదు.. ఈ రాష్ట్రాన్ని ఏలడానికి తనకన్నా మించిన వాడు లేడనీ అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఈ దేశానికి తనలాంటి ఆర్ధిక నిపుణుడు, సీఈవో మైండ్ సెట్ గల లీడర్, దార్శినికుడు కావాలని భావిస్తుంటారు. అందుకే ఆయన గతంలో విజన్ 2020 అన్నా.. ఇప్పుడు విజన్ 2047 అంటున్నా.. అందులో భాగమే. తాను అడ్వాన్స్డ్ మైండ్ సెట్ గల నాయకుడన్న భావన ఆయనలో పుష్కలంగా ఉంటుంది. వీటన్నిటినీ ఈ జైలు జీవితం పటాపంచలు చేస్తుందా? లేక ఎప్పటిలాగానే మళ్లీ మొదటికే వస్తారా? తేలియాల్సి ఉంది. ఏమంటారు!?