కొంపల్లిలో అంతేరా కిచన్ అండ్ బార్.. హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం
ఫుడ్ లవర్స్ కు సరికొత్త రుచులను అందిస్తున్న అంతేరా కిచన్ అండ్ బార్ అధినేతలు కొంపల్లి చుట్టుపక్కల ఉన్నవారికి శుభావార్తను అందించారు. ఇప్పటికే 5 బ్రాంచ్ లను దిగ్విజయంగా నడుపుతూ తాజాగా 6వ బ్రాంచ్ గా కొంపల్లిలో ప్రారంభించారు. ప్యాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా కొంపల్లిలో కిచన్ అండ్ బార్ హోటల్ ఘనంగా ఓపెనింగ్ జరుకుంది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడారు.
జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మంగళూరులో ఉన్న అంతేరా కిచన్ అండ్ బార్ కు ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో చూస్తునే ఉన్నాము అని హీరో నిఖిల్ సిద్దార్థ్ అన్నారు. తాాజాగా 6వ బ్రాంచ్ గా కొంపల్లిలో ప్రారంభం కావడం ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ హోటల్ చాలా విశాలంగా ఉందని ఫ్యామిలీ, యూత్ అందరికీ విపరీతంగా నచ్చే వాతావరణం కల్పించారని అంతేరా కిచన్ అండ్ బార్ అధినేతలు ఆశిష్ రెడ్డి, అనురాగ్ రెడ్డిలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ బావ, బిసినెస్ మ్యాన్ అయిన అమర్నాథ్ మద్దలూరి, మహేంద్రనాథ్ మద్దులూరి పాల్గొన్నారు.
650 సీటర్ తో కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ హోటల్ నిర్మించినట్లు హీరో నిఖిల్ చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కు అంతేరా కిచన్ అండ్ బార్ ఫేవరేట్ స్పాట్ అవబోతుందని, కేవలం ఫ్యామిలీలకు మాత్రమే కాదు యూత్ ను ఆకట్టుకునేలా లైవ్ బ్యాండ్ ఉందని, పార్టీలకు చేసుకోవడానికి టెర్రస్ ప్లేస్ ఉందని చెప్పారు. కాక్ టేల్స్ కూడా అందుబాటులో ఉంచడం అంతేరా కిచన్ అండ్ బార్ ప్రత్యేకం అని నిఖిల్ పేర్కొన్నారు. తప్పకుండా కొంపల్లి చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారైన రుచి చూడాలని పేర్కొన్నారు. ఇక ఫుడ్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయని చెప్పారు. అలాగే అంతేరా కిచన్ అండ్ బార్ లో రాజు గారి కోడి పలావ్, రాగి ముద్ద అంటే ఏంతో ఇష్టమన్నారు. చాలా సార్లు తన షూటింగ్ లకు ఇదే హోటల్స్ నుంచి పార్సల్ తెప్పించుకుంటారని చెప్పారు.
ఇక ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. 'స్వయంభు' సినిమాను భారీ బడ్జెట్ తో, ఎక్కడ లీకులు కాకుండా జాగ్రత్త పడుతూ నిర్మిస్తున్నట్లు చెప్పారు.