Mandali Venkata Krishna Rao Memorial Award : ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సింహాగిరిపై నృసింహాస్వామి పసుపు కొట్నం ఉత్సవం సందర్భంగా తీసిన ఫోటోకు అవార్డు వరించింది. స్వామి వారి వార్షిక తిరుకళ్యాణోత్సవం సందర్భంగా తెంటు శ్రీనివాస్ తీసిన ఫోటో మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ అవార్డు గెల్చుకుంది. ఈ పోటీలను ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్(ఐఐపీసీ), ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా(పీఏఐ) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి.
(నవంబర్ 1)న విజయవాడలో జరిగిన వరల్డ్ ఫొటో జర్నలిజం డే ఉత్సవాల్లో ఈ అవార్డును తెంటు శ్రీనివాస్ అందుకున్నారు. ఈ అవార్డుకు తనని ఎంపిక చేసిన ఐఐపీసీ, పీఏఐలకు తెంటు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది సెప్టెబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతిక నిర్వహించిన పోటీల్లో పురాతన దేవాలయాలు కేటగిరిలో కూడా గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కార్ అవార్డు లభించిన విషయాన్ని గుర్తు చేశారు. తన విజయాల్ని, ఈ అవార్డుల్ని వరాహ లక్ష్మినృసింహ స్వామి పాదాలకు అంకితమిస్తున్నాను అని అన్నారు.