For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కార్తీ "సర్దార్" తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
కార్తీ  సర్దార్  తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
Advertisement

హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవలి కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలని సెలక్టీవ్ గా పంపిణీ చేస్తూ, క్యాలిటీ చిత్రాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది.

కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. 'అభిమన్యుడు' చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు 'సర్దార్‌' ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement GKSC

సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కానుంది. Annapurna Studios Releasing Karthi, PS Mithran, Prince Pictures Sardar Grandly In Telugu States,Raashi Khanna,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.comతారాగణం: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఎలవరసు  తదితరులు

సాంకేతిక  విభాగం: దర్శకత్వం: పిఎస్ మిత్రన్, నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్, బ్యానర్లు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: రూబెన్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కతీర్

Advertisement
Author Image