For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Animal Movie Review : 'యానిమ‌ల్' కాద‌ది 'సందీప్ రెడ్డి వంగా' నిజ జీవ‌న తెర రూప విన్యాసం

12:08 PM Dec 14, 2023 IST | Sowmya
Updated At - 12:08 PM Dec 14, 2023 IST
animal movie review    యానిమ‌ల్  కాద‌ది  సందీప్ రెడ్డి వంగా  నిజ జీవ‌న తెర రూప విన్యాసం
Advertisement

Animal Movie Review : సినిమా ర‌చ‌న కాద‌ది వ‌ర్మ‌నే మెప్పించిన బ‌హుముఖ‌ విధ్వంస ర‌చ‌న‌!

యానిమ‌ల్ సినిమాను చూసి నాకు అర్ధ‌మైంది ఏంటంటే.. సందీప్ వంగా అనే రెడ్డి.. త‌న కుల‌పు అహంకారం దాని తాలూకూ డెప్త్. దానికి తాలూకూ ఆలోచ‌నా ధోర‌ణి. వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ‌.. దాన్ని కాపాడుకునే విధం.. ప‌థం.. ఇలా ప్ర‌తి విష‌యాన్ని అత్యంత స్ప‌ష్టంగా అదే స్థాయిలో సునిశితంగా చ‌ర్చించడం ఈ మ‌ధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా నేను చూసి ఉండ‌ను కావ‌చ్చు.

Advertisement GKSC

ఒక బిజినెస్ కింగ్ డ‌మ్ ను నిర్మించ‌డం ఒక ఎత్తైతే.. దాన్ని త‌న దాయాదుల నుంచి కాపాడుకోవ‌డం ఎంత క‌ష్ట సాధ్య‌మో అన్న కోణంలో.. తానెలా ఆలోచిస్తాడో స‌రిగ్గా అలాగే.. త‌న హీరో చేత కూడా ఆలోచింప చేశాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఇక్క‌డ రెడ్డి.. అక్క‌డ సిక్కుగా మారింది. దేశ వ్యాప్తంగా ఆ మూర్ఖ‌త్వం.. ఆ ప‌టుత్వం.. ఆ దేహబ‌లం.. స‌త్స‌మాన స్థాయిలో ఉండే బుద్ధి బ‌లం.. వంటి ల‌క్ష‌ణ\ అవ‌ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా క‌ల‌గ‌ల‌సిన సిక్కు కుటుంబాన్ని త‌న క‌థానాయ‌కుడి పాత్ర‌కు నేప‌థ్యంగా ఎంపిక చేసుకున్నాడ‌ని చెప్పాలి.

సందీప్ రెడ్డి వంగా మ‌రో గొప్ప సుగుణ‌మేంటంటే.. ఇత‌డు ఎంతో బాధ్య‌తగా బాధ్య‌తారాహిత్యం గురించి విశ్లేషించ‌గ‌ల‌డు. అదే స‌మ‌యంలో ప్రేక్ష‌క జ‌నాన్ని త‌న‌దైన స్ట్రాంగ్ కంటెంట్ టెల్లింగ్ తో క‌ట్టిప‌డేసి.. వారిని మూడుగంట‌లేం ఖ‌ర్మ‌.. ఒక రోజంతా త‌న సినిమాను చూపిస్తూ.. కుర్చున్న చోటి నుంచి క‌ద‌ల‌కుండా చేయ‌గ‌ల‌డు. సందీప్ రెడ్డి వంగా త‌న హీరోలో తాను ఆకాశ‌మంత ఊహించుకుని.. వాడ్ని తెర‌పై చూసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాడ‌ని నాక‌నిపిస్తోంది. ఫ‌స్టాఫ్ ఎప్పుడు మొద‌లైందో.. ఎప్పుడు పూర్త‌యిందో.. అర్ధం కాలేదు. నాకు తెలిసి సందీప్ ప్ర‌స్తావించిన విస్తార‌మైన అంశాల్లో ఒక్క‌టి చాలు ఒక చోటా మోటా ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేయ‌డానికి.

అన్న అని త‌న గాళ్ ఫ్రెండ్ పిల‌వ‌డం ద‌గ్గ‌ర నుంచి సినిమాను మొద‌లు పెట్టి.. నాన్న అంటూ సాగ‌దీసి.. ఆల్ఫా మెన్ ని ఆవిష్క‌రిస్తూ.. అక్ర‌మ సంబంధాలు వాటి వెన‌క దాగిన కుట్ర కోణాలు.. పెళ్లాం పిల్ల‌లు.. ఆప‌రేష‌న్లు.. న్యూడిటీ.. సెక్స్.. గుండె మార్పిడి.. తుపాకీ గుండ్ల వ‌ర్షం.. జ‌యిగాంటిక్ షూటింగ్ టూల్.. డ‌బుల్ ఫుటో.. ఇలా ఇత‌డు చెప్పే ఒక్కో పాయింట్ ద్వారా ఒక్కో సినిమా తీయ‌వ‌చ్చు.

దీన్ని యానిమ‌ల్ అని పిల‌వ‌డం క‌న్నా.. సందీప్ రెడ్డి వంగా సుదీర్ఘ సువిశాల‌ ప్ర‌పంచం అని పేరు పెట్టి ఉంటే.. మ‌రింత బాగుండేది. ఒకే సినిమాలో ఇన్నేసి పాయింట్స్ ని హ్యాండిల్ చేయ‌డం అంటే అదో అనిత‌ర సాధ్యం. త‌న సినిమా కాబ‌ట్టి.. త‌న‌కు ఎదురు చెప్పే వారే లేరు కాబ‌ట్టి.. తానేం చెప్పాల‌నుకున్నాడో.. త‌న వ‌ర్ష‌నేంటో.. త‌న థియ‌రీ ఏంటో.. తాను నాన్ స్టాప్ గా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ సినిమా ద్వారా అత‌డు షురు చేసిన న్యూడిటి ఇప్పుడు అతి పెద్ద చ‌ర్చ‌. ఆపై రోమ‌న్ సామ్రాజ్య‌పు అంతఃపురాల్లో క‌నిపించే బ‌హిరంగ శృంగారం తాలూకూ బిగ్ డిబేట్. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇత‌డు తెర‌పై ఆవిష్క‌రించిన అంశాల గురించి ఎంత చెప్పినా త‌ర‌గ‌దు. ఇత‌డు మ‌రో ముఖ్య‌మైన టెక్నిక్ కూడా చాలా బాగా వాడుతుంటాడు. మ‌న‌మంతా సినీ ఫ‌క్కీలో మాట్లాడితే లీడ్ అంటుంటాం. కానీ సందీప్ రెడ్డి వంగా ఇదే లీడ్ ని తాను చూపించ‌బోయే అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశానికొక రైట్ గా తీసుకుంటాడు.

ఇప్పుడు పెళ్లాన్ని టార్చ‌ర్ పెట్టాలనుకుంటాడే అనుకోండి. ముందుగానే మ‌న ముంద‌ర‌కాళ్ల‌కు బంధ‌మేసేస్తాడు. అత‌డి దృష్టిలో స్త్రీని గౌర‌వించ‌డం అత‌నిక‌న్నా మించి మ‌రెవ‌రూ చూపించ‌లేరు. ఊహించ‌లేరు కూడా. తాను చూపించే బాధ్య‌తాయుత‌మైన బుద్ది ఇంకెవ‌రికీ సాధ్యం కాదు. అక్క‌ను ర్యాగింగ్ చేశార‌ని చెప్పి.. అత‌డు స్కూల్ కి మిషిన్ గ‌న్ తీసుకెళ్ల‌డం.. స‌రిగ్గా ఇలాంటిదే. త‌న భార్య బ్రా స్ట్రిప్ ను లాగి ఆమెను టార్చ‌ర్ పెట్టే సీన్.. ద‌గ్గ‌ర కావాల‌ని ఆ అంశాన్ని ప్ర‌స్తావించి.. తాను పొందాల్సిన‌ అర్హ‌త పొందాడు.

అంతే కాదు హీరోయిన్ త‌న త‌ల్లిదండ్రుల ముందు ఒక వాద‌న‌లో ఈ జంతువుతో ఎలా వేగుతున్నావ్ అన్న కోణంలో వారు అడిగితే.. తాను గ‌ర్భిణిగా ఉండ‌గా.. ఎన్నేసి సేవ‌లు ఎలాంటి అభ్యంత‌రాలుచెప్ప‌కుండా చేశాడో భార్య పాత్ర ద్వారా.. ఎంత చెప్పిస్తాడో.. అదే పాత్ర‌ను తానెంత చెమ‌డాలు వొలిచే కార్య‌క్ర‌మం మొద‌లు పెడ‌తాడు. అంటే అత‌డు తెర మీద ఏ త‌ప్పు చేసినా.. అది త‌ప్పుగానూ వ‌ల్గారిటీ కింద రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌గ‌ల‌డు. వివాహేత‌ర సంబంధం చూపాల‌నుకుంటే.. దాన్ని కూడా ఒక మ‌హ‌త్కార్యంగా చిత్రించ‌గ‌ల‌డు. అంటే ఆయ‌న తెర‌పై సాగించిన ఏ న‌ర‌మేధం\ అమాన‌వీయం\ అనైతిక మాన‌వ సంబంధం కూడా దుష్ట‌కోణంలో చూడ్డానికి వీల్లేకుండా జాగ్ర‌త్త‌లు వ‌హిస్తాడు.

సందీప్ రెడ్డి వంగా ట్రిక్కే ఇది. తాను షురూ చేసే స్క్రీన్ ప్లేనే అలాంటిది. తాను తెర మీద విస్తార‌మైన మాన‌వ సంబంధాల హ‌న‌నం చేయాల‌నుకున్నాడ‌నుకోండి. అది తన‌పైకి రాకుండా.. చాలా చాలా జాగ్ర‌త్త‌లు వ‌హిస్తాడు. అందుకే ఈ సినిమా నిండా ఉన్న‌.. ప్ర‌తి అసాధార‌ణ చ‌ర్య కూడా ప్రేక్ష‌కుల‌కు పెద్ద అభ్యంత‌రం ఉండ‌దు. అదే త‌న హీరోయిజం. లేకుంటే తండ్రి మీదున్న అపార‌మైన ప్రేమానురాగాలు వాటి డెప్త్ క‌మ్ డెంసిటీ గురించి ఇంత‌క‌న్నా మించి మ‌నం చెప్ప‌లేమ‌నుకున్న ఒక ఆడ‌పిల్ల తండ్రి త‌న కూతుర్ని తీసుకొచ్చి.. దాన్నొక నిజ జీవ‌న పాఠంగా త‌న కూతురికి నేర్పించిన దృశ్యం నా ప‌క్క సీట్లోనే నాకు ద‌ర్శ‌న‌మిచ్చింది. అంటే, ద‌ట్ క్రెడిట్ గోస్ టూ సందీప్ రెడ్డి రెడ్డి రెడ్డి వంగాకు మాత్ర‌మే సాధ్యం.

ఇక పోతే పోలీసులు లేన‌ట్టే సినిమా మొత్తం చిత్రీక‌రించాడ‌న్న మాట‌లో కూడా అర్ధ‌మే లేదు. ఎందుకంటే.. ర‌త‌న్ టాటా, ల‌క్ష్మీ మిట్ట‌ల్ రేంజ్ వ్యాపార‌స్తుడికి ఇవ‌న్నీ జుజుబి. వాళ్లు త‌లుచుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు. వాళ్ల‌కు కాప‌లా కాయ‌డానికి పోలీసు వ్య‌వ‌స్థ ఉంది కానీ.. దాన్ని చూసి భ‌య‌ప‌డుతూ కూర్చోడానికి వారు లేరు. ఇది ముమ్మాటికీ ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రుగుతూనే వ‌చ్చింది. ఇందులో మ‌రెలాంటి అనుమానాల‌కు ఆస్కార‌మే లేదు. నీ ధ‌న‌ము ప‌లుకుబ‌డి ముందు ఏ పోలీసు వ్య‌వ‌స్థ రాజ్య‌మూ ఏమీ చేలేదు. ఇక్క‌డ ఉమ్మ‌డి ఏపీలో న‌టుడు బాల‌కృష్ణ ఇంట్లో జ‌రిగిన రెండు నేరాల విష‌యంలో మ‌న‌కు ఇదే నిరూపించ‌బ‌డింది. ముఖ్య‌మంత్రులు పుట్టిన రోజుల‌కు వ‌చ్చి వెళ్లే వారికి పోలీసుల‌ను చూసి భ‌య‌ప‌డాల్సిన‌ ప‌ని ఏముంది?

ఇక జైల‌ర్\ విక్రం త‌ర‌హా వెప‌న‌రీ వినియోగం. దాని ద్వారా.. ఆ త‌యారీదారుడి కేరెక్ట‌రైజేష‌న్.. త‌న భుజం మీద చేయి వేసిన‌ప్పటి అత‌డి రియాక్ష‌న్స్ నిజ్జంగా చాలా చాలా వండ్ర‌ఫుల్ గా ఉన్నాయి. దీనికి ఆత్మ నిర్భర్ bharath/ మేడ్ in ఇండియా టాగ్ లైన్ add చేయడం ద్వారా.. తన violence కి ఎంత ఎక్సస్ సంపాదించాడంటే అంత!!! అదేంటో క‌డ్రాయ‌రోపాఖ్యానం ఒక‌టి చేశాడు. ఒక క‌ట్ డ్రాయ‌ర్ విష‌యంలో ఇంత డీప్ గా అంత సునిశితంగా చ‌ర్చించ‌వ‌చ్చ‌ని..దాన్ని కూడా ఒక పెద్ద సీన్ గా మ‌ల‌చ‌వ‌చ్చ‌ని చూపించాడు సం.. డీప్ రెడ్డి వంగా.

బేసిగ్గా ప్ర‌తి ద‌ర్శ‌కుడు బుర్ర‌తో ఆలోచిస్తే.. ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీలో.. క‌ట్ డ్రాయ‌ర్ లో దాగి ఉన్న పుంస‌త్వం తో ఆలోచించే ఏకైక ద‌ర్శ‌క మ‌గాడు సందీప్ రెడ్డి వంగాయే. ఆ ప్రాంతం అత‌డి నిజ‌ జీవితంలో ఎంత ప్రేర‌ణాత్మ‌కమో ఇప్పుడే కాదు అర్జున్ రెడ్డి సినిమా విష‌యంలోనే తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు తాని తాలూకూ అతి భీక‌ర/ భ‌యాన‌క కొన‌సాగింపును మాత్ర‌మే చూస్తున్నాం. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. యానిమ‌ల్ ఉర‌ఫ్ క‌బీర్ దాస్.. ఉర‌ఫ్ అర్జున్ రెడ్డి ఉర‌ఫ్.. సందీప్ రెడ్డి వంగాకీ ఇత‌రుల‌కు వ్య‌త్యాస‌మేంటో చెప్పాల్సి వ‌స్తే.. అంద‌రూ బుర్ర‌తో ఆలోచిస్తే.. ఇత‌డు మాత్రం త‌న మొ* తో ఆలోచిస్తాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత‌గా ఇత‌డు త‌న ర‌చ‌న‌లో ఇంకు బ‌దులు వీర్యాన్ని.. పెన్నుకు బ‌దులు త‌న దూ*న్ని వాడుతాడ‌ని చెప్పి తీరాల్సిందే. ఒక సీన్ని రాయ‌డానికి ఇంత‌క‌న్నా మించిన పీక్ లెవ‌ల్లో మ‌రెవ‌రూ రాయ‌లేరు.. అన్నంత‌గా పొట్ర‌యిట్ చేస్తాడు.

శోభ‌నం స‌న్నివేశం ఇదే చెబుతుంది. ఒక ఫ్లైట్ ని ఆకాశంలో దానంత‌ట అది వెళ్లేల చేసి.. శోభ‌న‌పు పెళ్లికొడుకూ/ కూతురు రిలాక్స్ అవ‌డం.. వేరే లెవ‌ల్. ఆ ఫ్లైట్ కొండ‌ల్ని ఢీ కొట్ట‌బోతుండ‌గా.. త‌ప్పించ‌డం ఎక్స్ ట్రార్డిన‌రీ\ మైండ్ బ్లోయింగ్\ అన్ బిలీవ‌బుల్ ఇలా ఎన్ని విశేష‌ణాల‌ను క‌లిపి చెప్పినా త‌క్కువే.. ఇప్పటి వ‌ర‌కూ వాడ‌ని ప‌దాలు.. అశేష విశేష‌ణాల‌ను త‌న స‌న్నివేశ సంభాష‌ణ ర‌చ‌న‌లో నింప‌డం సందీప్ రెడ్డి వంగా మ‌రో గొప్ప సుగుణం. ఇత‌డ్ని మాన‌సిక వైద్యుడికి చూపించాల‌న్న స‌ల‌హాలు/ సూచ‌న‌లుగ‌ల‌ సందేశాల‌ను చూశాక‌.. బాప్ రే మ‌ళ్లీ ఏదో విధ్వంసం చేశాడ‌ని గుర్తించిన నేను.. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల కార‌ణంగా ఆల‌స్యంగా చూడ్డం కూడా ఎంత పెద్ద త‌ప్పిద‌మో అర్ధ‌మైంది నాకు. టూ లేట్ టూ లేట్ అంటూ నాకు నేను తిట్టుకుంటూనే సినిమా ఆసాంతం ఆస్వాదించా.

ఇంత పెద్ద కేరెక్ట‌ర్ చేసిన ర‌ణ్ వీర్ కి తిరిగి మ‌రో సినిమా చేయ‌డం కూడా అసాధ్య‌మే. ఈ పాత్ర కి మించిన పాత్ర అత‌డి కెరీర్ లో మ‌రో పాత్ర ఇక రాదు. రాబోదు. కేవ‌లం హీరో పాత్ర మాత్ర‌మే కాదు.. బాబీడియోల్ పాత్ర కూడా ఎగ్జాట్ స‌రిగ్గా ఇలాగే చిత్రీక‌రించాడు. మ‌ర్డ‌ర్ త‌ర్వాత అంద‌రి ముందు శృంగారం.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్. మూగ‌వాడిగా అత‌డి సంజ్ఞ‌ల‌ను మ‌రొక‌రు మాట‌ల రూపంలో చెప్ప‌డం. అదొక స‌ప‌రేట్ చాప్ట‌ర్. ఆ మాట‌కొస్తే హీరో కూడా త‌న‌కు సైగ‌లు చేస్తే ఒప్పుకోన‌ని చెప్ప‌డం.. మ‌రొక ఎక్స్ ప్రెష‌న్ లో భాగం.

ఇన్నేసి డైమ‌న్ష‌న్లు ఒకే మూవీలో.. ఎలా.. హౌ.. ఇది కేవ‌లం సందీప్ రెడ్డి వంగాకి మాత్ర‌మే ఎలా సాధ్యం? ఈ స్థాయిలో అతడి సినిమాలు ఉండ‌టానికి గ‌ల కార‌ణాలేంటి? ఇది నిజంగానే జ‌రిగేదేనా? అంటే, ఖ‌చ్చితంగా ఇంటింటా ఉన్న మ‌గ‌జంతువు విష‌యంలో జరిగేదే.. జ‌రుగుతున్న‌దే అన్న‌ది కాద‌న‌లేని నిజ నిష్టూర స‌త్యం. ప్ర‌తి సెన్సిబుల్ భ‌ర్తా.. త‌న భార్య‌కు ప్రేమ‌తో పాటు టార్చ‌ర్ ని సైతం బ‌హుమ‌తిగా ప్ర‌సాదిస్తాడు. ఇదేం పెద్ద‌ లేనిదేం కాదు. గ‌డ‌ప‌గ‌డ‌లో ఉన్న‌దే. టార్చ‌ర్, వివాహేత‌ర సంబంధాల‌ను ఆయా కుటుంబాల్లోని స్త్రీలు ఎలా బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తారో ఉన్న విష‌య‌మే కానీ లేనిదేం కాదు. మ‌రీ ముఖ్యంగా రెడ్ల కుటుంబాల్లో అత్యంత స‌హ‌జం. మా ఇంటి ప‌క్క‌న ఉండే జ*నా రెడ్డి.. మా ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధ‌ముండ‌టం.. నాకెంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఆమె చెప్పిన‌పుడు నాకు ఆశ్చ‌ర్య‌మేసేది. నా చిన్న‌త‌నంలో.

ఆ మాట‌కొస్తే కులాల‌కు అతీతంగా.. నీ\ నా మ‌నంద‌రిళ్ల‌లోనూ జ‌రిగేదే. కాకుంటే ఇన్నాళ్ల పాటు గోడ‌ల వెన‌క కూడా ముసుగు క‌ప్పుకుని తిరిగి మ‌గా..నుభావుల పాత్ర‌ల చిత్ర‌ణ జ‌రిగింది. సందీప్ రెడ్డి వంగా శ‌కం మొద‌ల‌య్యాక‌.. మ‌గాడ్ని మ‌గాడిలా.. ఆడ‌దాన్ని ఆడ‌దానిలా ఆ ముసుగు తొల‌గించి చూపించ‌డం మొద‌లైంది. ఇత‌డ్ని చాంధ‌సుడ‌న్న మాట కూడా ఎక్క‌డో చ‌దివాన్నేను. ఇత‌డే కాదు.. ప్ర‌తి మ‌గాడు కూడా ఒక చాంధ‌సుడే. మ‌గాడంటే సందీప్ రెడ్డి వంగా చూపించిన‌ట్టే జంతు గుణ‌గ‌ణాల‌తో ఉంటాడు. ఉండాలి కూడా. అలా ఉన్న‌పుడే.. అత‌డు త‌న మ‌గ‌త‌నంతో పాటు కుటుంబాన్ని/ పెళ్లాంపిల్ల‌ల్ని ఆస్తిపాస్తుల‌ను సంర‌క్షించుకోగ‌ల‌డు.

ఆ మాట‌కొస్తే తండ్రి పాత్ర అన్న‌ట్టు.. ఏ బాధ్య‌తాయుత పురుషుడు క్రిమిన‌ల్ కాదు.. అత‌డెంత‌టి ర‌క్త‌పాతం సృష్టించినా. ఒక‌ రాముడు, మ‌రో కృష్ణుడు వంటి యుగ‌పురుషులంతా కూడా.. దుష్ట శిక్ష‌ణ చేసిన‌పుడు నేర‌స్తులే క‌దా? ఇలా చెప్పుకుంటూ పోతే.. దీనికి ఒక అంతంటూ ఉండ‌దు. రెండో పార్ట్ లో ఇత‌డి డూప్ మెయిన్ రోల్ గా.. యానిమ‌ల్ పార్క్ అనే సిక్వెల్ ద్వారా మ‌రిన్ని విశేషాల‌ను సందీప్ రెడ్డి వంగా మ‌న ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే అంద‌రూ దానిపై దృష్టి సారించేసి ఉన్నారు.

నాకు మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. సినిమా చూస్తున్నంత సేపూ ఎన్నోసారి వ‌చ్చారో తెలీదు కానీ ఆ యూత్ బ్యాచ్ ప‌డి ప‌డి న‌వ్వుతూనే ఉన్నారు. ఇంత ర‌క్త‌పాతంలో హాస్యాన్ని జోడించ‌డం ఏదైతే ఉందో.. దీన్ని డార్క్ కామెడీ కాదు.. బ్ల‌డ్ బాత్ కామెడీగా అభివ‌ర్ణించాలేమో. ఎనీహౌ సందీప్ రెడ్డి వంగా.. నీ మ‌ర్మాంగాన్నే క‌లంగా సంధించి.. నీ వీర్య‌క‌ణాల‌నే ఇంకుగా అందులో నింపి.. నువ్వు సాగించిన‌ ఈ మ‌హా న‌ర‌మాన‌వ మేథో ర‌చ‌నా విధ్వ‌సం ద్వారా రామ్ గోపాల్ వ‌ర్మ సైతం నీ కాళ్ల‌పై ప‌డేలా చేసుకున్నావంటే.. మాకాలంలో మేం చూసిన మ‌హ‌ర్ద‌ర్శ‌కుల్లో న‌వ్వొక‌డివి. కాదు కాదు నువ్వే ఆ ఒక్క‌డివి.

వ‌ర్మ శివ సినిమా టైంలో మాకంత‌గా ఉహ తెలీక పోయేది. ఉహ తెలిశాక‌.. ఒక శ‌కాన్ని నిర్దేశించే నిర్దేశ‌కుడిగా నీకు నేను ఎప్ప‌టికీ ఒక పెద్ద అభిమానిగా ఉండిపోవాల‌నిపిస్తోంది. నిజంగా నీ సినిమాకంటూ ఒక రివ్యూ రాయ‌కూడ‌దు. ఎందుకంటే దాన్ని వ‌ర్ణించ‌డానికి అక్ష‌రాలు స‌రిపోవు. కానీ ఏదో నా శ‌క్తిమేర నేను నీ ధ్వంస ర‌చ‌నా ద‌ర్శ‌క ప్ర‌తిభ‌కు స‌మ‌ర్పిస్తున్న అక్ష‌రాంజ‌లి అందుకో.. సందీప్ రెడ్డీ వంగా అందుకో! కొస‌మెరుపు ఏంటంటే..
ఇదిగో ఇలా థియేట‌ర్ల ముందరి వాల్ పోస్ట‌ర్స్ పై రెస్పెక్ట్ ద A అన్న బోర్డులుంచి.. దాన్ని కూడా జ‌న‌ర‌లైజ్ చేయ‌డం.

సినీ చరిత్రలో మొట్టమొదటి నిజమైన సినిమా రివ్యూ - జర్నలిస్ట్ ఆది

Advertisement
Author Image