For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Andhra Saraswata Parishad : ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్మర్ శ్రీ లా గణేషన్

08:21 PM Dec 12, 2023 IST | Sowmya
Updated At - 08:21 PM Dec 12, 2023 IST
andhra saraswata parishad   ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్మర్ శ్రీ లా గణేషన్
Advertisement

రాజమహేంద్రవరం : ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు.

7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement GKSC

డా. గజల్ శ్రీనివాస్ అధ్యక్షులు - 9849013697

Advertisement
Author Image