Political నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్..
Political ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవీ నవరాత్రుల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ వెళ్ళిన జగన్ ఆంధ్ర ప్రదేశ్ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలతో పాటూ పసుపు కుంకుమ సమర్పించారు.
ఆచారం ప్రకారం పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద జగన్ తలకు అర్చకులు పరివేష్టం చుట్టారు. అనంతరం ఇంద్రకీలాద్రి పైన ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.. ఇప్పటికే దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు రాగా.. శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు..
ఏకమైన రోజును అమ్మవారి దర్శనానికి మరింతమంది భక్తులు విచ్చేశారు వీరందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ఆలయ అధికారులు పగడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు సీఎం రాకతో ఇంద్రకీలాద్రి పైన సందడి నెలకొంది.. ఇప్పటికే ఈ రోజు రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు నిత్యం విజయవాడ ను దర్శించుకుంటున్నారు.. జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రతి ఏడూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు.
