For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP Baseline Election Survey : వైసీపీదే ఘన విజయమని తేల్చేసిన ఆంధ్రప్రదేశ్ బేస్‌లైన్ ఎలక్షన్ సర్వే - కీలకాంశాలు ఇవే ?

06:00 PM Apr 12, 2024 IST | Sowmya
Updated At - 06:00 PM Apr 12, 2024 IST
ap baseline election survey   వైసీపీదే ఘన విజయమని తేల్చేసిన ఆంధ్రప్రదేశ్ బేస్‌లైన్ ఎలక్షన్ సర్వే   కీలకాంశాలు ఇవే
Advertisement

రాబోయే ఎన్నికల్లో 120-130 అసెంబ్లీ, 20-21 ఎంపీ సీట్లలో ఎగరనున్న వైసీపీ జెండా గతంలో ఎన్నడూ లేని విధంగా 60% మహిళా ఓట్లు వైసీపీ వైపే ప్రజలందరినీ ఏకం చేస్తున్న బలమైన వైసీపీ క్యాడర్, పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల డ్రామాతో వైసీపీకి పెరిగిన మద్దతు, వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు, ఈసీకి ఫిర్యాదుతో కూటమి పార్టీలపై పెరిగిన వ్యతిరేకత, పొత్తులో ఉన్న పార్టీల్లో సఖ్యత లోపించడం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది.

తమకు మంచి చేసిన వైసీపీ వైపే నిలబడతామంటున్న మైనార్టీలు, వైసీపీకే అండగా నిలబడుతున్న బీసీల్లో వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు కన్నా జగన్‌కే ఎక్కువ మంది మద్దతు, జనసేన, బీజేపీ తీసుకున్న 31 సీట్లలో 4-6 సీట్లకు మించి లేని విజయావకాశం, అధికార వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా వైసీపీ ఓట్లను చీల్చడం పోయి, సహాయపడేలా ఉన్న కాంగ్రెస్, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తున్న వాలంటీర్ వ్యవస్థ, పవన్ కల్యాణ్‌ను సీఎం చేసుకోవాలనుకున్నా, 21 సీట్ల కేటాయింపుతో నిరాశలో జనసైనికులు,

Advertisement GKSC

బీజేపీకి ఉన్న నామమాత్రపు 1-2% ఓట్లు కూడా కూటమి వల్ల వ్యతిరేకమై వైసీపీకే లబ్ధి చేకూరుస్తుంది. వైసీపీపై ఉన్న ఒకే ఒక్క వ్యతిరేకత అంతర్గత రహదారులు సరిగా లేకపోవడం, వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత ఓట్ షేర్ ఇంకా మెరుగయ్యే అవకాశం, 2019లో జగన్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో దాదాపుగా అన్నీ నెరవేర్చడం వైసీపీకి కలిసొచ్చే అంశాలు.

Advertisement
Author Image