For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

జ‌నాన్ని న‌మ్మి మోస పోవ‌ద్దు - జ‌గ‌న్ని చూసి నేర్చుకోవ‌ల్సిన పాఠ‌మిదేనా ? - ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది

07:43 AM Jun 05, 2024 IST | Sowmya
Updated At - 07:45 AM Jun 05, 2024 IST
జ‌నాన్ని న‌మ్మి మోస పోవ‌ద్దు   జ‌గ‌న్ని చూసి నేర్చుకోవ‌ల్సిన పాఠ‌మిదేనా     ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది
Advertisement

నీ జాగ్ర‌త్త‌లో నువ్వుండు. రాష్ట్రం కూడా నీ ఇల్లే. నీ ఇంటి సొమ్ము ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటావో.. అంతే జాగ్ర‌త్త‌గా కాపాడుకో. దాన్ని అంద‌రికి పంచి పెట్టి.. ఆ తిన్న వాళ్లు విశ్వాసం చూపిస్తార‌ని అశించ‌వ‌ద్దు. అభాసుపాలు కావ‌ద్దు. జ‌గ‌న్ని చూసి నేర్చుకోవ‌ల్సిన గుణ‌ పాఠం ఇదేనా!? అంటే ఇదే ఇదే ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు… జ‌గ‌న్ నమ్మ‌కం అల్లా ఒక‌టే.. నేను జ‌నానికి సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా దోచి పెట్టేశా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం, నా క్రిస్టియ‌న్, నా మైనార్టీల‌ని.. వాళ్ల‌ను సాంతం న‌మ్మాడు. న‌ట్టేట మునిగాడ‌ని అంటారు కొంద‌రు.

అంతే కాదు ఓసీల సీట్లు కూడా బీసీల‌కు పంచి పెట్టాడు. అంతెందుకు.. విజ‌య‌వాడ, గుంటూరు, నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప వంటి ప్రాంతాల్లో ముస్లిముల‌కు అదిప‌నిగా సీట్లిచ్చాడు. అక్క‌డున్న మెజార్టీ ముస్లిములు త‌మ త‌మ అభ్య‌ర్ధుల‌కు ఓట్లు వేసిన‌ట్టే క‌నిపించ‌దు. ఇలా ఎందుకు జ‌రిగింది? కార‌ణాలు ఏమై ఉంటాయి.. అని త‌ర‌చి చూడగా తెలిసిందేంటంటే.. సంక్షేమ ప‌థ‌కాలు ఉండాల్సిందే కానీ, ఇంత భారీగా కాదు. ఆ మాట‌కొస్తే… ఇక్క‌డ జ‌నం తీసుకుని మ‌రీ తిట్టి పోసిన విధాయ‌కం ఉంది. ఒక స‌మ‌యంలో మాకెందుకీ డ‌బ్బు??? అంటూ నిర‌సించిన దుస్థితి కూడా ఎదురైంది. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చినా స‌రే.. అవేవీ ఇక్క‌డ ప‌ని చేయ‌లేదు.

Advertisement GKSC

ఒక ర‌కంగా చెబితే జ‌గ‌న్ ది అడ్వాన్స్డ్ పొలిటిక‌ల్ మైండ్ సెట్ గా ఇప్ప‌టి వ‌ర‌కూ అంచ‌నా వేశారు ఎంద‌రో రాజ‌కీయ ఉద్ధండులు. బాబు- ఆర్కే మాట్లాడుకునేట‌పుడు కూడా.. ఇదే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కానీ, మ‌రీ జ‌నం ఇంత‌గా జ‌గ‌న్ని చీద‌రించుకుంటార‌నుకోలేదు. ఎన్టీవీ, టీవీ9 రెండూ సర్వేలు చేశాయి. వాటిలో టీవీ9 త‌న‌ స‌ర్వేను బ‌హిర్గ‌తం చేయ‌గా.. ఎన్టీవీ త‌మ అంచ‌నాల‌ను పూర్తిగా దాచి పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీవీ చేసిన కామెంట్ ఏంటంటే.. ఇంత చేసి కూడా జ‌గ‌న్ ఓడిపోతే.. అదొక చ‌రిత్ర అవుతుంద‌ని అన్నారు. అంతెందుకు ఇదే ఎన్టీవీ వేదిక‌గా మాట్లాడిన ప్రొ. నాగేశ్వ‌ర్ సైతం.. పోస్ట‌ల్ బ్యాలెట్ త‌ర‌హాలో ఇదే హ‌వా కొన‌సాగితే.. మ‌నం ఏడాది పాటు రాజ‌కీయాలు మానుకుని.. కొత్త రాజ‌కీయాలు ఎలా చేయాలో నేర్చుకోవాల‌ని అన్నారు.

జ‌గ‌న్ ప‌రిస్థితి చూస్తుంటే దాదాపు ఇలాగే క‌నిపిస్తోంది. జ‌నానికి ఉన్న‌ సొమ్మంతా ఇచ్చేసి.. ఇదే త‌న‌ని గెలిపిస్తుంద‌నుకోవ‌డం స‌రైన ప‌ని కాదని తేలిపోయింది. ఇవ్వ‌డం ముఖ్యం కాదు.. త‌మంత తాము పొంద‌డ‌మే స‌రైన‌ద‌ని భావించిన‌ట్టున్నారు. అందుకే ఇంత‌టి దారుణ‌మైన ఫ‌లితాల‌ను క‌ట్ట‌బెట్టారా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. చంద్ర‌బాబు చూడండీ.. ఇప్ప‌టికీ ఆయ‌న త‌న‌ను తాను న‌మ్ముకుంటాడు కానీ ఎవ్వ‌ర్నీ న‌మ్మ‌డు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఎన్డీయే కూట‌మిలో అత్యంత‌ కీల‌క‌మైన స‌భ్యుడు. కానీ వింత ఏంటంటే.. ఆ కూట‌మిలోనే ఆయ‌న కొన‌సాగుతాడ‌ని చెప్ప‌డానికి వీల్లేదు. ఇప్ప‌టికే కేసీ వేణుగోపాల్.. బాబుతో మంత‌నాలు\ బేరాలు వాట్ ఎవ‌ర్ ఇటీజ్ మొద‌లు పెట్టేశారు. మాకు రావ‌ల్సిన‌వి ఇవి. వీటిని మీరు గానీ ఇస్తే మీతోనే మేము వ‌స్తామ‌ని.. ఇటు మోదీకి అటు రాహుల్ కీ ఆఫ‌ర్ చేయ‌గ‌ల‌డాయ‌న‌. అలా చేయ‌డ‌మే అస‌లు సిస‌లు రాజ‌కీయం.

గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న బొంగూ బోశాండం.. ఈ కాలంలో అస్స‌లు న‌డ‌వ్వు. నీ కూడు తిని నిన్నే తిట్టి పోస్తారు. వాళ్ల ప్రాప‌కం పొందాల‌నుకోవ‌డం అన్నంత మూర్ఖ‌త్వం మ‌రొక‌టి లేదు. ఎస్సీ- ఎస్టీ- బీసీ- ముస్లిం- క్రిస్టియ‌న్ మైనార్టీల‌కు ఓట్లు ఎలా వేయాలో కూడా తెలీదంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.(ద‌ళిత బంధు ఇచ్చి కూడా కేసీఆర్ ఓడిపోలేదా? అన్న‌ది వీరు చెప్పే ఉదాహ‌ర‌ణ‌) ఇలాంటి వాళ్లను న‌మ్మి గెలుస్తాన‌ని భావించ‌డం కూడా త‌ప్పేనంటారు. క‌మ్మ‌+ కాపు క‌ల‌సి చేసిన రాజ‌కీయాల ఊబిలో వీరంతా కొట్టుకుపోయార‌నే చెప్పాలి. అలా ఎలా చెబుతార‌ని చూస్తే.. జ‌గ‌న్ వీళ్ల‌కిచ్చే తాయిలాల‌ను ఎల్లో మీడియా అది పనిగా ఎగ‌తాళి చేస్తూ వ‌చ్చింది. జ‌గ‌న్ నుంచి వాళ్ల‌ను దూర‌మ‌య్యేలా చేసింది. అంత‌క‌న్నా మించి బాబు ఇస్తున్నాడ‌హో! అని ట‌ముకేసింది కూడా ఇదే మీడియా. స‌రిగ్గా అదే స‌మ‌యంలో రాధాకృష్ణ రూపంలో అలివిగాని హామీల‌ను ఇవ్వ‌డం స‌రైన ప‌ని కాదు క‌దాని కూడా మ‌. మ‌.. అనిపించింది.

చూశారా! ఎంత క‌న్ ఫ్యూజ్ డ్రామా న‌డిచిందో. ఇందులో పిచ్చోళ్ల‌యిందెవ‌రు??? మ‌రెవ‌రూ.. బ‌డుగు బ‌ల‌హీన ప్ర‌జ‌లే. ఇలా పూర్తి గంద‌ర‌గోళానికి గురైన వీరంతా క‌ల‌సి.. ఏకంగా తాము కూర్చున్న కొమ్మ‌ను తామే న‌రుక్కున్నార‌న్న మాట వినిపిస్తోంది. ఇదంతా జ‌నం త‌మ‌కు తాము చేసుకున్న ద్రోహం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలిస్తే.. ఏపీ శ్రీలంక అవుతుంద‌న‌గానే న‌మ్మేశారు. ఇచ్చినందుకు కూడా ఆడిపోసుకున్నారు. ఆపై చంద్ర‌బాబు అంత‌క‌న్నా మించి ఇస్తాడంటే నిలువునా దాన్ని ఆహ్వానించారు. మ‌రి అంత‌క‌న్నా మించి ఇచ్చిన‌పుడు ఆంధ్ర మ‌రో శ్రీలంక, జింబాబ్వే, వెనుజుల కాదా??? అంటే వాళ్ల ద‌గ్గ‌ర ఆన్స‌ర్ లేదు.

అలాగ‌ని ఇదేమీ వారికి తెలియింది కాదు. ఇక్క‌డా మ‌న‌కో క్లారిటీ దొరుకుతుంది. ఒక సంద‌ర్భంలో లోకేష్ అన్న మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. రేష‌న్\ ఫించ‌న్ అంద‌రికీ ఇచ్చేది లేదు. మా వాళ్లు ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే ఇస్తామ‌ని అన్నాడు. దీన్నిబ‌ట్టీ చూస్తే వీళ్లు సూప‌ర్ సిక్స్ లో ఇస్తామ‌న్నదేదీ.. అంద‌రికీ ఇచ్చే ఛాన్సే లేదు. దీంతో డ‌బుల్ ఖ‌ర్చు అయ్యే ప్ర‌స‌క్తే లేదు. దీన్ని జ‌నం కూడా దీన్ని బాగానే అవ‌గ‌తం చేసుకునే ఓటు వేశార‌ని చెప్పాలి. దానికి తోడు బాబు వ‌స్తే క‌రువు విల‌య‌తాండ‌వం చేస్తుంద‌ని జ‌న సామాన్యంలో ఎలాంటి న‌మ్మ‌కాలున్నాయో. జ‌గ‌న్ అధికారంలో ఉంటే.. ప‌నిపాట‌లు అలా ఉండ‌వ‌న్న భావ‌న కూడా బ‌లంగా ఏర్ప‌డింది. ఇందుక్కార‌ణాలు కూడా లేక పోలేదు.

మ‌రి దీనికి మ‌న ద‌గ్గ‌రున్న‌ ఎవిడెన్సులు ఏంట‌ని చూస్తే.. మీరు విన్నారో లేదో.. లోకేష్ ఒక మాట అన్నాడు. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష అన్న ప‌థ‌కం ద్వారా.. ప్రైవేటు క్లినిక్కులు ఏమై పోవాల‌ని ప్ర‌శ్నించాడు. దీన్నిబ‌ట్టీ చూస్తే.. ప్రైవేటు విద్య‌, ప్రైవేటు వైద్యం అన్న‌ది బ‌లంగా ఉండాలి. చంద్ర‌బాబు అధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ విద్య‌, వైద్యం పూర్తిగా ప‌డ‌కేస్తాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప్రైవేటు విద్య, వైద్యం ప‌డ‌గ విప్పుతాయి. దీని ద్వారా జ‌రిగేదేంటి? అంటే, ఇటు ప్ర‌భుత్వ విద్యా, వైద్య అధికారులంతా హాయిగా ప‌ని లేని జీతం.. ప‌నిమాలా తీస్కుంటూ కాల‌క్షేపం చేస్తుంటారనీ. అదే ప్రైవైటు విద్యా, వైద్య రంగాలు ఫుల్ బిజీ బిజీగా ఉంటాయనీ ఒక అంచ‌నా.

వీటి ద్వారా వారికి అటు ఉచిత జీత భ‌త్యాలు. ఇటు వీరికి చేతినిండా ప‌ని\ డ‌బ్బులు. ఈ రెండింటి మ‌ధ్య చిక్కిన సామాన్యుడు రేయంబ‌వ‌ళ్లు గొడ్డు చాకిరీ చేస్తూ బ‌తుకునీడ్చుతుంటాడు. దీంతో ఏం జ‌రుగుతుందంటే ఎటు చూసినా జ‌నం ప‌ని పాట‌ల్లో క్ష‌ణం తీరిక‌లేకుండా బ‌త‌క‌డం క‌నిపిస్తుంది. అదే జ‌గ‌న్ ఏం చేస్తాడంటే ఈ రెండూ ప్రభుత్వ ప‌రంగా ఉచితంగా అందివ్వ‌డం ద్వారా.. ఎవ‌రికీ పెద్ద‌గా ప‌నీ పాటా ఉండ‌ని వాతావ‌ర‌ణం క‌ల్పిస్తాడ‌ని అంటారు. (పైపెచ్చు ఇదంతా ఖ‌ర్చే త‌ప్ప‌.. పెట్టుబ‌డి కింద‌కు రాదు)

విద్యా వైద్యం సామాన్యుడికివి రెండు అత్యంత క్లిష్ట‌మైన\ కీల‌క‌మైన‌ ప‌నులు. ఇవి సుల‌భంగా అందివ్వ‌డం ద్వారా.. వాడు హాయిగా సేద దీరుతుంటాడు. అలాంటి వాతావ‌ర‌ణం వ‌ల్ల‌ ప‌నులు ముందుకు సాగుతున్న‌ట్టే క‌నిపించ‌ద‌ని అంటారు సామాజిక‌ నిపుణులు. బాబునామిక్స్ ప్ర‌భావ‌మంటే ఇదే. జ‌గ‌నామిక్స్ ని అనూహ్యంగా బీట్ చేసింది కూడా ఇదే. ఓ సోష‌ల్ ఎన్విరాన్మెంట‌ల్ రీసెర్చ్ లో తేలిన విష‌యం కూడా ఇదే. మ‌నిషికి ఏవి అత్యంత ముఖ్య‌మైన‌వో.. వాటినేవీ పూర్తి ఉచితంగా అందివ్వ‌రాదు. వాటికంటూ ఒక డిమాండును ఏర్ప‌ర‌చాలి. అలా క‌ల్పించిన‌పుడే.. జ‌న‌మంతా పాల‌కుడి కంట్రోల్లో ఉంటారు. అలా చేయ‌డం మానేసి.. వారిక్కావాల్సింది ఫ్రీగా ఇచ్చేసి.. ఓట్లు వేయ‌మ‌ని వారి చెంత‌కే వెళ్లి చేయి చాచ‌కూడ‌దు. అలా చేస్తే.. వాళ్లు నీ మాటకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విలువనివ్వ‌రు.

ఏపీలో జ‌రిగిందిదే. నువ్వీ ప‌ని చేస్తే నీకీ ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది అన్న‌దే అస‌లైన ప‌ర్ఫెక్ట్ క‌మ్ ప‌బ్లిక్ బిజినెస్ రూల్. అలాక్కాకుండ డిమాండ్ లేని స‌ప్లై చేస్తే దానికంటూ ఒక‌ విలువ ఉండ‌దు. ఇదే ప్రూవ్ అయిందిక్క‌డ‌. నీ ప‌ని+ ప్ర‌తిఫ‌లం= అభివృద్ధి. నీవంటూ ఒక ప‌ని చేయ‌కుండా ప్ర‌తిఫ‌లం పొందితే.. అభివృద్ధి చాలా చాలా దారుణంగా కుంటు ప‌డుతుంది. కాబ‌ట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఈ విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకోకుండా జ‌గ‌న్ ఎన్నాళ్ల పాటు రాజ‌కీయం చేసినా అవి ఇలాగే నీరుకారిపోతుంటాయ‌ని న‌మ్మాల్సి ఉంటుందంటారు సోష‌ల్ ఎన్విరాన్మెంట‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్.

చివ‌రిగా ఒక మాట‌..

రోజా అన్న మాటను ఇక్క‌డ ప్ర‌స్తావించాలి.. ఒక ముఖ్య‌మంత్రి అన్నాక ప్ర‌జ‌ల్ని మోసం చేయాలి కానీ- వారి చేత జ‌గ‌న్ లా మోసపోకూడ‌దు. దానికి తోడు.. మ‌నం ఇత‌రుల‌ బ‌ల‌హీన‌త‌ల్ని న‌మ్మ‌డం క‌న్నా.. మ‌న బ‌లాన్ని మ‌నం ఎక్కువ‌గా న‌మ్మాలి. దీన్ని పూర్తిగా మ‌ర‌చిపోవ‌డ‌మే జ‌గ‌న్ మోహ‌న రెడ్డికి ఇంత‌టి భారీ ప‌రాభ‌వాన్ని తీసుకొచ్చి పెట్టిందన్న‌ది ఒక అంచ‌నా. (కుటుంబం, కులం వంటి బ‌లాల‌ను వ‌దిలి.. ఎస్సీ- ఎస్టీ- బీసీ- ముస్లిం- క్రిస్టియ‌న్- మైనార్టీల పేద‌రికం దాని బ‌ల‌హీన‌త‌లే త‌న‌కు టానిక్ లా ప‌ని చేస్తాయ‌ని న‌మ్మి మోస‌పోయిన వాడిగా జ‌గ‌న్ని ఈ చ‌రిత్ర లెక్కించింద‌ని చెప్పాల్సి ఉంటుంది.)

మోర‌ల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే..

స‌ర్వే జ‌నా సుఖినోభ‌వంతు పాత మాట‌. స‌ర్వే జ‌నా సంక‌నాకినా ప‌ర్లేదు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని నమ్మాలి. అలా చేయ‌క పోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డ్డ అతి భారీ విప‌త్తుగా దీన్ని ప‌రిగ‌ణిచాల‌ని సూచిస్తూ..సెల‌వు!!!

Advertisement
Author Image