For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న సింబా సినిమా!

12:45 AM Sep 17, 2024 IST | Telugu World Now
Updated At - 03:09 PM Sep 17, 2024 IST
హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న సింబా సినిమా
Advertisement

ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు.

సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింబా. మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి. కానీ థియేటర్లో ఆడియెన్స్‌ నుంచి అంతగా రెస్పాన్స్ రాదు. కానీ అలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి.

Advertisement GKSC

తాజాగా సింబా మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.

డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది.

Advertisement
Author Image

Telugu World Now

View all posts