For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Ari Movie : వాట్సప్ చేయండి.. సినిమా చూడండి.. అరి వెరైటీ ప్రమోషన్స్

06:59 PM Feb 10, 2025 IST | Telugu World Now
Updated At - 08:25 PM Feb 14, 2025 IST
ari movie   వాట్సప్ చేయండి   సినిమా చూడండి   అరి వెరైటీ ప్రమోషన్స్
Advertisement

FILM NEWS : పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నారు జయ శంకర్. ఇక దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. ఇప్పటికే సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.

భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం నటించింది. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడేస్తున్నారు. ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్.

Advertisement GKSC

మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ల‌ను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు.

భిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు. ఇప్పుడు అరి మూవీ టీం కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. పేపర్ బాయ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Advertisement
Author Image

Telugu World Now

View all posts