For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మానవసేవే మాధవసేవ లక్ష్యంగా శ్రేయోభిలాష్ సేవా ట్రస్ట్ : మంత్రి జగదీశ్వర్ రెడ్డి

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
మానవసేవే మాధవసేవ లక్ష్యంగా శ్రేయోభిలాష్ సేవా ట్రస్ట్   మంత్రి జగదీశ్వర్ రెడ్డి
Advertisement

హైదరాబాద్, డిసెంబర్ 27 : ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని, శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ కు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సినీ నటులు సుమన్ లు పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం హైదరాబాదులోని బి ఎం బిర్లా సైన్స్ మ్యూజియంలోని భాస్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ బ్రోచర్ ఆవిష్కరణ, క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రేయోభిలాషి ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లకు క్రీడా సామాగ్రిని, జ్ఞాపికలను అందజేశారు, కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Advertisement GKSC

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... గెలుపుకు నాంది క్రీడా స్ఫూర్తి లేకపోవడం వల్లనే అనేక కుటుంబాల్లో యువతి, యువకులు నష్టపోతున్నారని, అలాంటి క్రీడాస్ఫూర్తి ప్రతి ఒక్కరు అవలంబించుకోవలని కోరారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు సంవత్సరం పొడవునా చేపడుతున్నటువంటి సేవాకార్యక్రమాలను తీసుకున్నటువంటి శ్రేయోభిలాషి సేవా ట్రస్టును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు.

రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర మాట్లాడుతూ... శ్రేయోభిలాషు శివ ట్రస్ట్ చేస్తున్న సేవలకు తాను మనస్ఫూర్తిగా ఆర్థికంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందున్నానని ఆయన స్పష్టం చేశారు. శ్రేయోభిలాషి సేవ ట్రస్టు ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ముగ్ధుడనై తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రముఖ సినీ నటులు సుమన్ వెల్లడించారు. నవయుగానికి నాంది శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ అని, ట్రస్టు ద్వారా సమాజ సేవ చేయడానికి శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ కంకణం కట్టుకున్నదని, యూవతి, యువకులను క్రీడా రంగాలలో రాణించడానికి తమ ట్రస్ట్ ద్వారా క్రీడా సామాగ్రిని అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు విష్ణు జగతి వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ సలహాదారులు, ప్రముఖులు, జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, డాక్టర్ మంతెన దామోదర చారి, పునుకుల శ్రీనివాసరావు, డాక్టర్ సోమేశ్వర రావు, శ్రీ శ్రీహన్ ఆర్నవ చటర్జీ, శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు కొలనుపాక వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం, కోశాధికారి గంప ఆంజనేయులు, మొగిలి రాజశేఖర్ రెడ్డి, శ్రేయోభిలాషి సేవ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Author Image