జేఈఈ అడ్వాన్సుడ్ లో జగిత్యాల జిల్లా విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు
12:12 AM Jun 23, 2023 IST | Sowmya
Updated At - 12:12 AM Jun 23, 2023 IST
Advertisement
ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్ రెడ్డి కి ఆలిండియా జనరల్ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు.
విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి యశ్వంత్ రెడ్డి అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ డేటన్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేస్తున్నారు. రిశ్వంత్ రెడ్డి కెమిస్ట్రీలో 87, ఫిజిక్స్ లో 74, మ్యాథ్స్ లో 58 మొత్తం 219 మార్కులు సాధించాడు. హైదరాబాద్ నల్లకుంట లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు.
Advertisement