For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Actor Vijay Antony : తన ఆరోగ్యం గురించి స్పందించిన నటుడు విజయ్ ఆంటోని..

09:12 PM Jan 24, 2023 IST | Sowmya
Updated At - 09:12 PM Jan 24, 2023 IST
actor vijay antony   తన ఆరోగ్యం గురించి స్పందించిన నటుడు విజయ్ ఆంటోని
Advertisement

Actor Vijay Antony : తమిళ్ హీరో విజయ్ ఆంటోని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ సలీం, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్. ఇక బిచ్చగాడు సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. అయితే ‘బిచ్చగాడు-2’ చిత్ర షూటింగ్‌లో తమిళ హీరో విజయ్ ఆంటోని గాయపడ్డ సంగతి తెలిసిందే. మలేసియాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. బోట్లలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అతడ్ని మలేసియాలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న విజయ్ కుటుంబ సభ్యులు మలేసియా చేరుకున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న విజయ్‌ను కుటుంబ సభ్యులు చెన్నై తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, అతడు కోమాలో ఉన్నాడని కూడా ప్రచారం జరిగింది. విజయ్ ముఖానికి గాయాలై, దంతాలు కూడా ఊడిపోయాయని మరో ప్రచారం జరిగింది. దీంతో విజయ్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర వేదనకు గురయ్యారు. విజయ్ ఆంటోని కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఆంటోని స్పందించాడు.

Advertisement GKSC

ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేశాడు. ‘‘ప్రియమైన మిత్రులారా.. మలేసియాలో ‘పిచైకారన్-2’ (బిచ్చగాడు-2) షూటింగ్‌లో దవడ, ముక్కుకు గాయాలుకాగా, వాటికి సంబంధించి సర్జరీ పూర్తైంది. ఈ సర్జరీ నుంచి సురక్షితంగా కోలుకున్నా. ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ పూర్తైంది. వీలైనంత త్వరగా మీతో మాట్లాడాలి. నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించినందుకు, సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశాడు.

Advertisement
Author Image