For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

2001లో ఖుషి విడుదలైన సమయంలో జరిగిన కథగా "ఫస్ట్ డే ఫస్ట్ షో"

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
2001లో ఖుషి విడుదలైన సమయంలో జరిగిన కథగా  ఫస్ట్ డే ఫస్ట్ షో
Advertisement

పూర్ణోదయ క్రియేషన్స్- శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టీజర్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Advertisement GKSC

జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఆసక్తికరంగా వుందని ప్రసంశించిన ఆయన, ప్రాజెక్ట్‌ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు.

2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2001లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదలైన సమయంలో జరిగిన కథగా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టిక్కెట్లని సంపాదించే క్రమంలో హీరో పడిన ఇబ్బందులు చుట్టూ ఈ కథ వుండబోతుంది. భిమానుల హంగామా, ఆ సమయంలో థియేటర్ల వద్ద వాతావరణం టీజర్ లోచక్కగా చూపించారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటీనటులు వున్నారు. ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోదని టీజర్ చూస్తే అర్దమౌతుంది. శ్రీకాంత్ రెడ్డి తన తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సంచితా బాసు అందంగా కనిపించింది. టీజర్ కి రాధన్ ఇచ్చిన నేపధ్య సంగీతం క్యాచిగా వుంది. టీజర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ "మజ్జా మజ్జా" స్మాష్ హిట్ గా సాధించి, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో రిజిల్, జోష్ , చింగారి వంటి షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా మాధవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.Ace Director Trivikram Srinivas Launched Teaser Of Poornodaya Creations, Srija Entertainments, Mitra Vinda Movies First Day First Show,telugu golden tv,my mix entertainements,www.teluguworldnow.com.1తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా

సాంకేతిక విభాగం:
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image