Abhiram : ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారి చేతుల మీదగా 'అభిరామ్' టీజర్ లాంచ్
లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాసులు నిర్మాతగా రామకృష్ణార్జున్ దర్శకుడిగా వస్తున్న సినిమా అభిరామ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శ్రీనివాసులు గారు ప్రసన్నకుమార్ గారిని కలిసి టీజర్ చూపించడం జరిగింది.
టీజర్ చూసిన అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : ఇప్పటికే ఈ సినిమా ఆడియో టిప్స్ మ్యూజిక్ లో విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. పాటలకు చాలా మంచి స్పందన లభిస్తోంది. టీజర్ లో చూస్తుంటే ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ తో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో కనిపిస్తోంది. ఈ సినిమాలో శివ బాలాజీ గారు యష్ రాజ్ గారు తో పాటు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ రఘు బాబు గారు అన్నపూర్ణమ్మ గారు తులసి గారు వై విజయ గారు నటించారు. బాహుబలి ప్రభాకర్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. గండికోట సంస్థానం ల భారీగా ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఇంతమంది మంచి ఆర్టిస్టులతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అయింది త్వరలో సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమా ద్వారా నిర్మాత శ్రీనివాసులు గారికి దర్శకుడు రామకృష్ణార్జున్ గారికి మంచి సక్సెస్ రావాలి అలాగే ఇంకా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలి. అభిరామ్ టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఈ సినిమాలో నటించిన అందరికీ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ కి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత శ్రీనివాసులు గారు మాట్లాడుతూ : మా ఈ అభిరామ్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న అన్నారు.
బ్యానర్ : లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం : యష్‌రాజ్, శివ బాలాజీ, నవమి గాయక్
నిర్మాత : జింకా శ్రీనివాసులు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం : రామకృష్ణార్జున్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డి ఓ పి : జగదీష్ కొమారి
సంగీతం : మీనాక్షి భుజంగ్
కొరియోగ్రఫీ : చంద్ర కిరణ్
స్టంట్స్ : విన్చెన్ అంజి
సాహిత్యం : సాగర్ నారాయణ ఎం
ఆర్ట్ డైరెక్టర్ : చంటి
కో-డైరెక్టర్ : మడత శివ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఉల్లగంటి ప్రసాద్
పి ఆర్ ఓ : మధు VR