For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie Review : 'ఆవేశం' అనే ఈ మ‌ల‌యాళ సినిమా ఎక్స్ ట్రీమ్ లెవ‌ల్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్. Review by Senior Journalist Audi

by Journalist Audi, Jithu Madhavan, Fahadh Faasil, Sajin Gopu, Pooja Mohanraj
04:54 PM May 15, 2024 IST | Sowmya
Updated At - 04:54 PM May 15, 2024 IST
by Journalist Audi, Jithu Madhavan, Fahadh Faasil, Sajin Gopu, Pooja Mohanraj
movie review    ఆవేశం  అనే ఈ మ‌ల‌యాళ సినిమా ఎక్స్ ట్రీమ్ లెవ‌ల్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్  review by senior journalist audi
Advertisement

ఫాహ‌ద్ ఫాజీ ప్ర‌ధాన పాత్ర పోషించ‌డంతో పాటు ముగ్గురిలో ఒక నిర్మాత‌గానూ వ్య‌వ‌హరిస్తూ జితూ మాధ‌వ‌న్ డైరెక్ష‌న్ లో.. ముగ్గురు డెబ్యూ కుర్రాళ్ల‌తో తీసిన ఈ సినిమా 150 కోట్లు ఎలా వ‌సూలు చేసిందా ? అని చూస్తే పిచ్చెక్కి పోయింది. సినిమా అంతా తాగుడు తినుడు ర‌బ్బ‌ర‌బ్బా  డ్యాన్సులాడుడు కాలేజీ స్టూండెట్స్ జీవితాల‌తో చెడుగుడు కానీ, సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది.

ఇందులో నాకు న‌చ్చిన ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. ఒక మ‌రుగుజ్జు అనిపించేలాంటి కుర్రాడ్ని మెయిన్ స్టూడెంట్- విల‌న్ గా చూపించ‌డం.. వీడు వీడి వేషాలు.. అబ్బో నెక్స్ట్ లెవ‌ల్... ఇక హీరో కుర్రాళ్లు ముగ్గురూ ఎర‌క్క పోయి వ‌చ్చాము- ఇరుక్కు పోయామూ అన్న రీతిలో.. ఒక గ్యాంగ్ స్ట‌ర్ ప్రేమాభిమానాల మ‌ధ్య‌ ఇరుక్కుపోతారు.. సినిమా అంతా స‌గం రంగా అత‌డి గ్యాంగ్ చేసే అల్ల‌రి చిల్ల‌ర వేషాలు, ఫైటింగులు తాగుడు తిరుగుడు అంటూ ర‌క‌ర‌కాలుగా సాగుతుంది..

Advertisement GKSC

సినిమా మెయిన్ థీమ్ పాయింట్ ఏంటంటే.. ఇంజినీరింగ్ కాలేజ్ ర్యాగింగ్ కార‌ణంగా.. ఓ ముగ్గురు కుర్రాళ్లుతాము అనుభ‌వించిన బాధ ప‌గ‌వాడికి కూడా రాకూడ‌ద‌న్న ఆలోచ‌న కొద్దీ.. ఒక గ్యాంగ్ స్ట‌ర్ ద్వారా త‌మ రివేంజ్ తీసుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు.. ఆ క్ర‌మంలో త‌గిలేవాడే క‌న్న‌డ‌- రంగ అనే గ్యాంగ్ స్ట‌ర్.. హీరోల్లో ఒక‌డికి అనుకోకుండా.. బాత్రూంలో త‌న అనుమ‌తి లేకుండా సిగ‌రెట్ ముట్టించుకుని.. అనెస్పెక్టెడ్ గా అవుతుంది రౌడీ షీట‌ర్ రంగా.. తో ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి సినిమా ఊపందుకుంటుంది.. నాన్ స్టాప్ ఎంట‌ర్టైన్ మెంట్..

అస‌లు సినిమాలో రంగా వ‌చ్చాడంటే ఎన‌ర్జీ లెవ‌ల్- వెరే లెవ‌ల్.. మ‌ల‌యాళ సినిమాలంటే అదెంత సూప‌ర్ హిట్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అయినా స‌రే సెమీ ఆర్ట్ మూవీగానే క‌నిపిస్తుంది.. అలాంటిది.. ఆవేశం.. మాత్రం క‌ల్ట్ మా(క్లా)సిక్ గా క‌నిపించింది నాకు.. సినిమాలో ఇది బాగుంది- అది బాగోలేద‌ని మ‌నం చెప్ప‌లేం.. అన్నీ అద్భుతః.  ఒక మ‌ల‌యాళం సాంగ్ ని ఎంజాయ్ చేయ‌డం నేను అదే తొలిసారి. అంతే కాదు.. ఇదే సినిమాలో ఈ కుర్రాళ్లు ఎంజాయ్ చేయ‌డానికంటూ ఇద్ద‌రు వ్యాంప్ ల‌ను వ‌దిలి.. వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తుంటాడు రంగా.. ద గ్యాంగ్ స్ట‌ర్.

అయితే.. అది వాళ్ల‌కు సూట్ కాదు.. దీంతో వాళ్ల మ‌ధ్య ఒక డ‌బ్ స్మాష్ వంటి గేమింగ్ పెట్ట‌డం.. ఆపై
రంగా బ‌ర్త్ డే సాంగ్ న‌డుస్తుంటే.. హీరోల్లో ఒక‌రి త‌ల్లి ఫోన్ చేస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేయ‌డం.. అంత జోష్ ఫుల్ సాంగ్ లో అది నిజంగా వండ్ర‌ఫుల్ గా క‌నిపిస్తుంది.. ఇక సినిమాలోని మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏంటంటే.. హీరోలు ఇంజినీరింగ్ స్టూడెంట్స్.. వీరు గూండాలుగా మారారంటూ ఇంటికి మెసేజ్ పెడ‌తాడు ప్రిన్స్ ప‌ల్.. వాళ్లు సార్ సార్ సార్ అంటూ బ‌తిమాలి.. ఫైన‌ల్ గా మీకున్న బ్యాక్ లాగ్స్ అన్నిటినీ సింగిల్ అటెంప్ట్ లో కంప్లీట్ చేస్తే క్ష‌మించి వ‌దిలేస్తానంటాడు..
అప్పుడు మొద‌ల‌వుతుంది అస‌లు రివ‌ర్స్ డ్రామా.. అలా అలా సినిమా నాన్ స్టాప్ ఎన‌ర్జీతో సాగుతుంది..

ఏ కుర్రాళ్ల‌యితే మందు- సిగ‌రెట్ వంటి వెస‌నాల కోసం వెంప‌ర్లాడుతారో వాళ్లే వాటికి దూరంగా పారిపోవాల‌ని తీవ్ర య‌త్నాలు సాగిస్తారు.. ఆఖ‌ర్న‌ త‌మ ఫేవ‌రేట్ గ్యాంగ్ స్ట‌ర్ గురువు వ‌ల‌లో చిక్కి
త‌మను ఇంత వ‌ర‌కూ చేర‌దీసి ఆద‌రించిన రౌడీషీట‌ర్ కే చెక్ పెట్టేందుకు దోహ‌ద ప‌డ‌తారు.. ఫైన‌ల్ గా వీళ్ల చేత క‌త్తి ప‌ట్టించి మ‌ర్డ‌ర్స్ చేయించే ప్లాన్ వేసిన ఒక మాఫియా డాన్.. వీళ్ల చేత ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు ఎలా రాయిస్తాడు.. అందులో వాళ్లు ఒక స‌బ్జెక్ట్ ఫెయిల్ అయితే.. ఎలా రియాక్ట్ అవుతాడ‌నే ఎండింగ్ తో సినిమా పూర్త‌వడం విశేషం. ఇందులో ఉన్న‌దంతా మందు- మ‌గువ‌- విందూ- పొందు
వంటి యాంటీ సోష‌ల్ ఎలిమెంట్సే.. కానీ ఇది ఇచ్చే మెసేజ్ నా కొడుకు స్థాయి వ‌య‌సుగ‌ల వారికి కూడా అర్ధ‌మై పోయింది.

మ‌నం ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కోసం విప‌రీతంగా ఎగ‌బ‌డ‌తామో.. దాన్ని వారికి అనంతంగా ఇచ్చేస్తే..
వారు అదంటేనే హ‌డ‌లి చ‌చ్చిపోతార‌నేదే ఈ సినిమా ద్వారా చిన్న పిల్ల‌ల‌కు కూడా అర్ధ‌మై పోయే విష‌యం.. అదన్న మాట ఆవేశం వెన‌క దాగిన సందేశం! నాకు తెలిసి.. ఈ మూవీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంప‌ల్స‌రీగా కొని మ‌రో భీమ్లా నాయ‌క్ లా రీమేక్ చేయ‌డం గ్యారంటీ.. ఎందుకంటే ఇందులో మెయిన్ కేరెక్ట‌ర్ ప‌వ‌న్ అయితేనే బాగా స‌రిపోతాడు సినిమా చూస్తున్నంత సేపు నాక‌దే అనిపించింది.

Advertisement
Author Image