For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AAP : తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న ఆప్ మంత్రి... వీడియోలు వైరల్ !

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
aap   తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న ఆప్ మంత్రి    వీడియోలు వైరల్
Advertisement

AAP : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. మసాజ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న పాత వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసింది. మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో లు వైరల్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

మనీలాండరింగ్ కేసులో మే 30న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన విచారణ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్యేందర్ జైన్ తాను ఉంటోన్న సెల్ లోనే ఒకరితో కాళ్లు, వీపు, తలకు మసాజ్ చేయించుకుంటున్నట్లు ఈ వీడియో ఉంది. ఆ మంత్రి అవినీతికి పాల్పడినప్పటికీ సీఎం కేజ్రీవాల్ ఆయనకు మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు.

Advertisement GKSC

తీహార్ జైలులో జైన్‌కు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని కోర్టులో పేర్కొంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయిన సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదే కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న వైభవ్‌ జైన్‌, అంకుశ్‌ జైన్‌లకు కూడా బెయిల్ రాలేదు.

Advertisement
Author Image