For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

GULF NEWS : దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్ యువకుడు

10:08 PM Oct 22, 2024 IST | Sowmya
Updated At - 10:08 PM Oct 22, 2024 IST
gulf news   దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్ యువకుడు
Advertisement

వెతికి పెట్టాలని 'ప్రవాసీ ప్రజావాణి' లో విజ్ఞప్తి

హైదరాబాద్ గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్ రాజ్ (32) అనే యువకుడు ఉద్యోగం కోసం విజిట్ వీసాపై దుబాయికి వెళ్లి జాడ తెలియకుండా పోయిన సంఘటన జరిగింది. ఈ నెల 14న దుబాయికి చేరుకున్న తమ కుమారుడు రాహుల్ 19న తన బ్యాగ్ దొంగలు కొట్టేశారని అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తమకు ఫోన్ లో చెప్పాడని, ఆ తర్వాత అతని మొబైల్ స్విచ్చాఫ్ అయిందని తల్లిదండ్రులు కుముదిని, గౌతంలు మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని 'ప్రవాసీ ప్రజావాణి' లో వినతి పత్రం సమర్పించారు.

Advertisement GKSC

తమ కుమారుడు రాహుల్ ను వెతికి పెట్టి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిసినవారు +91 98487 49667 మొబైల్ నెంబర్ కు వాట్సాప్ చేయాలని కోరారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, తెలంగాణ కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి వారికి తగిన సూచనలు చేసి దరఖాస్తు చేయించారు.

Advertisement
Tags :
Author Image