Crime : లూడో గేమ్ కు బానిసైన మహిళ.. తనను తానే పందంలో పెట్టుకున్న వైనం..
Crime ఆన్లైన్ మోసాలతో ఇప్పటికే ఎందరో బలైపోతున్నారు అయినప్పటికీ ఈ ఆన్లైన్ ఆప్ లో గేములు విషయంలో జాగ్రత్తగా ఉండకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి ఓ సంఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది..
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది ఓ మహిళ లూడో గేమ్ కి బానిస అయిపోయింది చివరికి తను వ్యసనం ఎంతలో దిగజారింది అంటే తనని తానే బెట్టింగ్ లో పెట్టుకునే అంతవరకు దిగజారింది.. ఇంతకు ఏం జరిగిందంటే.. ఆన్లైన్ లూడో గేమ్ కు బానిస అయిన ఓ మహిళా... ప్రతిరోజూ ఇంటి యజమానితో ఆట ఆడేది. డబ్బులు బెట్టింగ్ పెట్టి గేమ్ ఆడేది. చివరికి డబ్బులు లేకపోవడంతో.. తనను తానే పందెంలో పెట్టుకుంది. ఓడిపోవడంతో యజమాని దగ్గరే ఉండిపోయింది. ఆ విషయం భర్తకు ఫోన్ చేసి చెప్పింది. పైగా అక్కడకు రావొద్దని సలహా కూడా ఇచ్చింది. పాపం రాజస్థాన్‌లో కూలి పని చేసి డబ్బులు పంపించే భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
బాధిత మహిళ రేణు భర్తతోపాటు ప్రతాప్ గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతంలో ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆరు నెలల క్రితం భర్త పని కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. ఇటుకల బట్టీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పని చేసి ఆ డబ్బును భార్యకు పంపించేవాడు. అయితే ఆ డబ్బుతో ఇంటిని నడిపించాల్సిన ఆ ఇల్లాలు.. ఆన్‌లైన్ లూడో గేమ్ ఆడేది. ప్రతిరోజు ఆ ఇంటి యజమానితో లూడో గేమ్ ఆడుతూ ఉండేది.. చివరికి ఆ గేమ్ కి బానిసైపోయి డబ్బులు లేక తనంతనే ఆటలో పందెం వేసుకుంది చివరికి ఆటలు ఓడిపోయి తన యజమానికి సొంతం అయిపోయింది చేసేదేం లేక ఈ విషయాన్ని యజమానికి ఫోన్ చేసి చెప్పగా అతను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు..