For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Killer Movie : సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'కిల్లర్' నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఫస్ట్ లుక్

12:51 PM Nov 03, 2024 IST | Sowmya
Updated At - 12:51 PM Nov 03, 2024 IST
killer movie   సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్  కిల్లర్  నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఫస్ట్ లుక్
Advertisement

FILM NEWS : పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో "శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ "కిల్లర్" చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

"కిల్లర్" మూవీ మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - చేతిలో గొడ్డలి పట్టుకున్న పవర్ ఫుల్ వుమెన్ రోబోను పరిచయం చేశారు. ఆ రోబో జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ గా మారడం ఆసక్తికరంగా ఉంది. జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ లుక్ లో ఆమె ఒక భుజానికి వెజిటేబుల్స్ బ్యాగ్, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంది. అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ పవర్ ఫుల్ వుమెన్ రోబోను చూపిస్తోంది. మోషన్ పోస్టర్ లో చూపించిన ఎలిమెంట్స్ అన్నీ "కిల్లర్" మూవీపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.

Advertisement GKSC

నటీనటులు : జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, తదితరులు

Technical Team : Cinematography: Jagadeesh Bommisetti, Music: AsheerLuke, Suman Jeeva Ratan, VFX, Virtual Production: Merge XR, PRO: GSK Media (Suresh - Sreenivas), Banners: Think Cinema, Merge XR, AU&I Studios, Producers: Poorvaaj, Prajay Kamat, A. Padmanabha Reddy, Written and Directed by: Poorvaaj.

Advertisement
Author Image