బలగం సినిమాతో తెలంగాణ బతుకు బంధాన్ని గుర్తు చేసిన మొగులయ్య గారి మరణం బాధాకరం : మాజీ మంత్రి హరీష్ రావు
08:07 PM Dec 19, 2024 IST | Sowmya
Updated At - 09:29 AM Jan 04, 2025 IST
Advertisement
తెలంగాణ గర్వించదగ్గ జానపద కళాకారుడు
Telangana News : ఏడాదిన్నర క్రితం మొగిలయ్య గారు కిడ్నీ వ్యాధితో అనారోగ్యం పాలయ్యారన్న విషయం తెలియగానే, నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి వారికి మెరుగైన వైద్యం అందించాం. కొద్ది రోజుల చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నారు.
ఇక ఆయన ఆరోగ్యంగా ఉంటారని అందరం అనుకున్నాం. కానీ ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తున్నది. మొగిలయ్య గారు భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Advertisement