Khammam News : ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన
ఖమ్మం, మార్చి 23, 2024 (శనివారం) : భగత్ సింగ్ జీవితం యువతకు ఆదర్శం : భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తి దాయకం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 93వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, వృత్తి సంఘాల నాయకులు అంజయ్య, లింగయ్య తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ... బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉరికంబాన్నే ముద్దాడిన విప్లవ యువకిషోరాలు భగత్‌సింగ్, రాజ్‌గుర్, సుఖదేవ్‌లు, ఆ వీరుల త్యాగానికి నేటికి 93 ఏండ్లు అన్నారు. భిన్న మతాలు గల లౌకిక దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ‘‘ఒకే దేశం - ఒకే మతం’’గా చేయాలాని కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో ఆంక్షలు విధిస్తూ వారిదే దేశభక్తి అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘మతతత్వం వలసపాలన కంటే ప్రమాదం’’ అని భగత్‌సింగ్ వ్యాఖ్యానించాడు. కానీ భగత్‌సింగ్ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ ఈనాడు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్న వారందరిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తోందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వై విక్రం, ఎస్ నవీన్ రెడ్డి, దొంగల తిరుపతిరావు, రమ్య, ఎం.ఏ.జబ్బర్, సుదర్శన్, నాగ సులోచన, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్.కె.వి.ఏ. మీరా, వాసిరెడ్డి వరప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సుధాకర్, జిఎంపిఎస్ జిల్లా నాయకులు కోటేశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు సదానందం, సంగయ్య, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, హరినాయక్, ఎల్లంపల్లి సందీప్ (అమెరికా), డివైఎఫ్‌ఐ నాయకులు నాగరాజు, కూచిపూడి నరేష్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎస్. నవీన్ రెడ్డి
ప్రజా సంఘాల ఐక్య వేదిక
ఖమ్మం జిల్లా తరఫున
9912741649