For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సైబరాబాద్ లో ఘనంగా వన మహోత్సవం

03:51 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:51 PM May 11, 2024 IST
సైబరాబాద్ లో ఘనంగా వన మహోత్సవం
Advertisement

నార్సింగి పీఎస్ లో మొక్కలను నాటిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., కమీషనరేట్ పరిధిలోని వివిధ పీఎస్ లలో మొక్కలు నాటిన పోలీస్ సిబ్బంది. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం 3వ రోజులో భాగంగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమేనన్నారు. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ వారి స్ఫూర్తితో ప్రగతి కొనసాగించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారు ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతీ ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి భారత కీర్తిని దశదిశలా చాటాలన్నారు.

Advertisement GKSC

నార్సింగి పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో నార్సింగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తో కలిసి త్రివర్ణంలో గల బెలూన్లను ఆకాశంలోకి ఎగరవేసి, ఈ యొక్క స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. విద్యార్థులు, పోలీసు సిబ్భంది పెద్దమొత్తం లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషకరంగా ఉందన్నారు.

దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారవోసి , మరణానికి వెనుకాడకుండా మడమతిప్పని పోరాటాలు చేసిన సమరయోధుల స్ఫూర్తి, త్యాగనిరతితో మనం ఈ యొక్క స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను సైబరాబాద్ పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ నేత్యంలో పట్టనాలన్నీ కాంక్రీట్ జంగిల్ లను తలపిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. తద్వారా భవిష్యత్ తరాలకు నీడన్నివడం తో పాటు కాలుష్యరహిత ఆక్సిజన్ అందించినవారమవుతామన్నారు.

ఈ కార్య్రమంలో సీపీ గారితో పాటు సైబరాబాద్ జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, SCSC జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, నార్సింగి ఇన్ స్పెక్టర్ శివ కుమార్, రాయదుర్గం ఇన్ స్పెక్టర్ తిరుపతి మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

A grand forest festival in Cyberabad,Cyberabad CP Shri Stephen Ravindra, IPS Planted Plants at Narsinghi PS,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments,1

Advertisement
Author Image