For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

A BTech Student was Murdered in Kothagudem

03:02 PM Jun 01, 2024 IST | Sowmya
Updated At - 03:02 PM Jun 01, 2024 IST
a btech student was murdered in kothagudem
Advertisement

Kothagudem News : కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో యువకుడు హత్య కేసు లో నిందితుడిని వన్ టౌన్ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. గతం లో స్వల్ప వివాదం హత్యకు గల కారణం గా పోలీసులు పేర్కొన్నారు. బిటెక్ విద్యార్థి గుణదీప్ (21) హత్య కేసులో నిందితుడు కోటేశ్వర రావు ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేషం లో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ స్వల్ప వివాదం నేపథ్యం లో వైన్ షాప్ లో గుణాదీప్ అతని మిత్రుడు మద్యం సేవిస్తన్న క్రమంలో అక్కడే ఉన్న కోటేశ్వరరావు తో ఒకరి కొకరు పాత విషయం లో వాగ్వాదానికి దిగిన క్రమంలో దాడి చేశాడు. కోటేశ్వర రావు బలంగా గుణదీప్ పై పిడి గుద్దులు వేయటం తో గుణదీప్ అక్కడికక్కడే కుప్ప కులాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రి కి తరలించే లోగా మృతి చెందాడు. వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టి 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు.

Advertisement GKSC

Advertisement
Author Image