For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా విడుదలైన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

11:49 AM Mar 02, 2025 IST | Sowmya
Updated At - 11:50 AM Mar 02, 2025 IST
film news   దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా విడుదలైన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్
Advertisement

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులు మీదుగా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. యూత్ ని కట్టిపడేసే కంటెంట్ తో వస్తున్న తాజా చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మిస్తున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రాన్ని శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించారు. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పీ.ఏ దీపక్ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రానికి పనిచేయడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన రాఘవేంద్రరావు సినిమా కాస్ట్ అండ్ క్రూ ను అభినందించారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని మెచ్చుకున్నారు. మార్చి 7న విడుదల అవుతున్న 14 డేస్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన అంకిత్ కొయ్య హీరోగా నటిస్తుండగా ఆయన సరసన శ్రియ కొంతం హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా, లవ్, కామెడీ సన్నివేశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.

Advertisement GKSC

గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అమ్మాయి వాల్ల తల్లిదండ్రులకు, తాతాకు ఈ విషయాన్ని తెలియకుండా హీరోయిన్ ఎలాంటి పాట్లు పడింది అనేది చాలా ఆసక్తిగా ఉంది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా కెమెడీగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక ఫుల్ సినిమాలో ఆయన కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. శ్రియ కొంతం హీరోయిన్ గా నటిస్తున్నారు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ పై చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు.

అంకిత్ కొయ్య, శ్రియ కొంతం లతో పాటు ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు నటిస్తన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అసోసియేట్ గా పనిచేసిన శ్రీ హర్ష మన్నె 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రంతో డెబ్యూ గా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీ హర్ష మన్నె అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి స్క్రీప్ట్ కోర్స్ పూర్తి చేశారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో సత్య కోమల్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచి మార్చిన 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.

నటీనటులు : అంకిత్ కొయ్య, శ్రియ కొంతం, ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీ హర్ష మన్నె
బ్యానర్ : త్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సత్య కోమల్
సంగీతం : మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ : కే సోమ శేఖర్
ఎడిటర్ : ప్రదీప్ రాయ్
డైలాగ్స్ : దీపక్ రాజ్ ఏ, హిరన్మయి కళ్యాణ్, సరద సాయి చెన్నుభొట్ల
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ రవింద్రన్
పీఆర్ఓ : హరీష్, దినేష్

Advertisement
Author Image